Kurnool

News March 10, 2025

బీటీ నాయుడికు మరో ఛాన్స్.. కారణాలివే!

image

కర్నూలు జిల్లా టీడీపీ నేత <<15705127>>BT<<>> నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు నమ్మకస్తుడిగా ఉండటమే ఆయనను రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేర్చిందని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. న్యాయవాది అయిన ఆయన చంద్రబాబు అరెస్ట్ సమయంలో జైలులో తరచూ ములాఖత్ అయ్యారు. అధినేత సందేశాన్ని నాయకులకు చేరవేస్తూ సంధానకర్తగా పని చేశారు. వాల్మీకి సామాజికవర్గం ఆయనకు కలిసొచ్చిన మరో అంశం.

News March 9, 2025

బీటీ నాయుడుకు మరో ఛాన్స్

image

బీటీ నాయుడు జాక్‌పాట్ కొట్టారు. ఆయనకు <<15705007>>టీడీపీ <<>>మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమలదిన్నెకు చెందిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ నెల 29తో పదవీ కాలం ముగియనుండగా తాజాగా సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. రేపు నామినేషన్ వేయనున్నారు. బీటీ నాయుడు 1994 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

News March 9, 2025

అర్ధరాత్రి కర్నూలుకు పోసాని

image

పోసాని కృష్ణమురళిని విజయవాడ నుంచి మళ్లీ కర్నూలు జైలుకు తరలించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిన్న పీటీ వారెంట్‌పై కర్నూలు నుంచి విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే. పోసానిని రెండో రోజు విచారణ చేయనుండగా.. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. రేపు ఆయన బెయిల్ పిటిషన్‌పై కర్నూలు కోర్టులో విచారణ జరగనుంది.

News March 9, 2025

ఆదోని అథ్లెట్ కాజా బిందె నవాజ్‌కు గోల్డ్ మెడల్

image

45వ మాస్టర్స్ అథ్లెటిక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కాజా బిందె నవాజ్ 60+ పురుషుల విభాగంలో 300 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకుని ఆదోనికి గర్వించదగ్గ విజయం సాధించారు. ఏళ్ల శ్రమ, అంకితభావం, పట్టుదల ఫలితంగా ఈ గొప్ప ఘనత అందుకున్నారు. ఈ విషయం తెలిసి ఆదోని క్రీడాకారులు, అభిమానులు ఆయన మెచ్చుకున్నారు.

News March 9, 2025

నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

image

కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. శనివారం తీవ్ర వేడి వాతావరణం కొనసాగడంతో పాటు వడ గాల్పులు వీచాయి. ఈ క్రమంలో నంద్యాలలో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోపక్క కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో రాత్రి సమయంలో చలి తీవ్రత పెరిగింది. దీంతో పగలు ఎండలు, రాత్రి చలికి తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

News March 8, 2025

కుటుంబంలో సమాజంలో మహిళ పాత్ర విశిష్టం: కలెక్టర్

image

కుటుంబంలో, సమాజంలో మహిళ పాత్ర విశిష్టం అని కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం కర్నూలులోని కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండుగలా జరుపుకోవడం సాధించడమే మహిళలు సాధించిన గొప్ప గెలుపుగా అభివర్ణించారు. జాయింట్ కలెక్టర్ నవ్య పాల్గొన్నారు.

News March 8, 2025

మహిళలు, బాలికల భద్రతే మా ద్యేయం: కర్నూలు ఎస్పీ

image

మహిళలు, బాలికల భద్రతే తమ ధ్యేయమని ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీసు కుటుంబాల మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

News March 8, 2025

కర్నూలు జిల్లాలో 610 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్‌ పేపర్ 1బి, జువాలజీ పేపర్‌ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు జరిగాయి. 610 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 22,348 మంది హాజరు కావాల్సి ఉండగా 21,738 మంది పరీక్ష రాశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు.

News March 8, 2025

పోసానిని కస్టడీకి ఇవ్వండి: ఆదోని పోలీసులు

image

కర్నూలు జిల్లా జైలులో ఉన్న నటుడు పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ <<15653795>>ఆదోని<<>> పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ దీనిపై విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు.

News March 7, 2025

నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

image

వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరపాలక సంస్థ ఎస్ఈని ఆదేశించారు. శుక్రవారం కర్నూలు నగర శివార్లలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు వెల్లడించారు.