India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని కలెక్టర్ పి.రంజిత్ భాష ఆదేశించారు. శుక్రవారం కర్నూల్ నగరంలోని ఎస్ఎపీ క్యాంప్‌లోని నగర పాలక ఉన్నత పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు సులభంగా గణితం అర్థమయ్యేందుకు టిప్స్ సైతం అందించారు. అనంతరం విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు నేడు పార్ట్ 3లోని సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. చూచిరాతలకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 414 మంది గైర్హాజరు అయ్యారు. బి.క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలలోనే డీబార్ అయినట్లు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే ‘ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని మంత్రి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. ఈ లెక్కన కర్నూలు, నంద్యాలలోని మహిళల ఉచిత ప్రయాణాలు ఆ జిల్లాల వరకే పరిమితం అవుతాయి. పక్క జిల్లాలో ప్రయాణించాలంటే బార్డర్ నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మీ కామెంట్..
కర్నూలు జిల్లాలోని బీసీ, కమ్మ, ఈబీసీ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బలిజ కులాల మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ తెలిపారు. శిక్షణ అనంతరం కుట్టు మిషన్లను అందజేస్తామని చెప్పారు. ఆయా కులాలకు చెందిన 18-50ఏళ్ల మహిళలు తమ పరిధిలోని సచివాలయాల ద్వారా apobmms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99081 32030 నంబరుకు సంప్రదించాలన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.
ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా గురువారం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా కలెక్టర్ రంజిత్ బాషా కర్నూలులోని ఉస్మానియా కళాశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రంలో మెరుగైన వసతులు కల్పించామని అన్నారు. విద్యార్థులకు ఏ అవస్థలు కలగకుండా అన్ని చర్యలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కలెక్టర్ వెంట ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నారు.
నందవరం మండలంలోని జోహారాపురం గ్రామ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ చదువుల చక్రవర్తి(23) వ్యక్తిగత పనుల మీద బైకుపై వెళ్తుండగా పోలకల్ నుంచి రాయచూర్‌కు కందులు తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు జయమ్మ, పోసరప్ప కుమారుడిగా గుర్తించారు.
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో దేశంలోనే రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదయింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల మేరకు బుధవారం ఆత్మకూరులో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మొదటి వారంలోనే ఈ తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా.. ఇదే ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలిసింది.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీశ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. పట్టణంలోని గొల్లపేటకు చెందిన సతీశ్.. ఓ ప్రైవేట్ సంస్థలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఆత్మకూరులోని కేజీ రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో వెనక వస్తున్న బొలెరో వాహనం తగిలింది. తీవ్రంగా గాయపడిన సతీశ్.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.