Kurnool

News August 20, 2024

వైసీపీపై అసత్య ప్రచారం తగదు: మాజీ ఎమ్మెల్యే

image

టీడీపీ నేతలు నిజాలు తెలుసుకోకుండా వైసీపీపై అసత్య ప్రచారం చేయడం సరికాదని పత్తికొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి హితవు పలికారు. సోమవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పత్తికొండ నియోజకవర్గంలోని హోసూరుకు చెందిన టీడీపీ నాయకుడు శ్రీనివాసులును వారి సొంత పార్టీ నాయకులే హత్య చేశారని విమర్శించారు. వైసీపీ నాయకులపై నిందలు వేయడం సరికాదన్నారు.

News August 20, 2024

అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో అక్టోబర్ 18వ తేదీ వరకు ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని తహశీల్దార్లను సూచించారు. ఓటర్ల జాబితాలో తప్పు ఒప్పుల సవరణలను ఏఈఆర్వోలు, ఈఆర్వోలు స్వయంగా పరిశీలించాలన్నారు.

News August 19, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 150 దరఖాస్తులు

image

నంద్యాలలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 150 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు అర్జీల రూపంలో విన్నవించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు.

News August 19, 2024

విచారణ జరిపి న్యాయం చేస్తా: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమానికి 97 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ జీ.బిందు మాధవ్ తెలిపారు. సోమవారం కర్నూలులోని కొత్తపేట సమీపంలో ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. అర్జీదారులతో ఎస్పీ మాట్లాడుతూ.. తమ సమస్యలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తానని అన్నారు.

News August 19, 2024

‘మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి’

image

మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేసి, మహిళలకు భద్రత కల్పించాలని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కన్వీనర్ రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం సమాజానికి సిగ్గుచేటని అన్నారు.

News August 19, 2024

బీజేపీ నేత హత్యపై కేసు నమోదు.. విచారణ ప్రారంభం

image

కర్నూలు జిల్లా పెద్దహరివాణం గ్రామంలో బీజేపీ నేత శేఖన్న హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆదోని డీఎస్పీ సోమన్న హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. శేఖన్నకు గ్రామంలో ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన పార్టీ మారిన కొద్దిరోజులకే హత్యకు గురికావడం హాట్ టాపిక్‌గా మారింది.

News August 19, 2024

కర్నూల్ జిల్లాలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

image

ఎమ్మిగనూరు ఎన్నికల డీటీ రఘువీర్, హొళగుంద ఆర్‌ఐ రాజశేఖరన్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. రెవెన్యూ శాఖలో విధుల్లో నిర్లక్ష్యం, వివాదాల భూములను తొలగించడం తదితర కార్యకలాపాలకు పాల్పడటంతో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News August 19, 2024

కర్నూల్: ఈ టీచర్‌కు లోకేశ్ అభినందన

image

కర్నూల్ జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయిని కల్యాణి కుమారిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. పత్తికొండ మండలం జేఎం తండా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఆమె విద్యార్థుల సంఖ్యను పెంచడంలో కీలక పాత్ర పోషించారు. సుమారు 45 మంది విద్యార్థులను బడి బాట పట్టించారు. అలాగే వినూత్న రీతిలో పాఠాలు చెబుతున్న తీరును లోకేశ్ కొనియాడారు. కల్యాణిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

News August 19, 2024

మోదీ విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: సీపీఐ నారాయణ

image

మోదీ విధానాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆదివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై సెప్టెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తున్నామన్నారు.

News August 18, 2024

మహానంది వ్యవసాయ కళాశాల @31 ఏళ్లు

image

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మహానంది వ్యవసాయ కళాశాల ఏర్పడి నేటికి 31 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఈ కళాశాలను స్థాపించారు. ఎందరినో శాస్త్రవేత్తలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఆర్ఎస్‌లను తయారు చేసిన ఘనత ఈ కాలేజీకి ఉందన్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు పలు దేశాలలో ఇక్కడి విద్యార్థులు ఉన్నత పదవుల్లో విధులు నిర్వహిస్తున్నారు.