Kurnool

News August 10, 2024

ఫ్యాక్షన్ జోన్ , స్పెషల్ బ్రాంచ్, సీసీ కెమెరాలపై ఎస్పీ సమీక్ష

image

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా జిల్లాలోని ఫ్యాక్షన్ జోన్, స్పెషల్ బ్రాంచ్, సీసీ కెమెరాల నిర్వహణ(PCR) మొదలగు విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు వారి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాలు అక్కడ వర్గ, రాజకీయ కక్షలు, నెలకొనే ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు ,గొడవలు, అల్లర్లు మొదలగు వాటి గురించి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

News August 10, 2024

రైలు నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

బేతంచెర్ల-నంద్యాల రైల్వే లైన్‌లో కృష్ణమ్మ కోన వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు నుంచి కిందపడి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ తెలిపారు. మృతునికి దాదాపు 55 ఏళ్లు ఉంటాయని, లేత నీలిరంగు చొక్కా, టవల్ కలిగి ఉన్నారని పేర్కొన్నారు. మృతుని వద్ద తుగ్గలి నుంచి డోన్ వరకు టికెట్ లభించిందన్నారు. గుర్తించిన వారు నంద్యాల రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

News August 10, 2024

చౌడేశ్వరీ అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్

image

బనగానపల్లె మండలం నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని జిల్లా కలెక్టర్ రాజకుమారి దంపతులు దర్శించుకున్నారు. కలెక్టర్ దంపతులను అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి కామేశ్వరి, మాజీ పాలకమండలి చైర్మన్ పీవీ కుమార్ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.

News August 10, 2024

ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఆదోని వాసి

image

స్వీడన్‌లోని గోథెన్స్ బర్గ్ వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఆదోనికి చెందిన ఖాజా బందే నవాజ్ ఎంపికయ్యారని జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాండురంగా రెడ్డి, రవికుమార్ తెలిపారు. ఈనెల 13 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ పోటీల్లో 60 ఏళ్ల కేటగిరీలో పాల్గొననున్నారు. ఖాజా బందే నవాజ్‌కు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అభినందనలు తెలిపారు.

News August 10, 2024

కర్నూల్ జిల్లాలో 39 మంది ఎంపీడీవోల రిలీవ్

image

సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ జిల్లాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు బదిలీపై వచ్చిన ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జడ్పీ సీఈఓ నాసర రెడ్డి రిలీవ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 39 మంది ఎంపీడీవోలను రిలీవ్ చేసినట్టు ప్రకటించారు. ఇందులో అనంతపురం జిల్లాకు చెందిన వారు 23 మంది, కడప జిల్లాకు చెందిన వారు 16 మంది ఉన్నారని పేర్కొన్నారు.

News August 10, 2024

కిడ్నాప్ కేసు.. కర్నూలులో వైసీపీ నేత అరెస్ట్

image

కర్నూలులో సంచలనం సృష్టించిన వ్యాపారి ప్రవీణ్ కుషాల్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేతతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న ప్రవీణ్‌ను కిడ్నాపర్లు బలవంతంగా అపహరించారు. తండ్రి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేత పెద్ద మద్దిలేటి ఆయన అనుచరులు అనిల్, సురేశ్, భాస్కర్, మిథున్‌ను అరెస్ట్ చేశారు. కోడుమూరు MLA టికెట్ విషయంలో డబ్బులు తీసుకుని మోసం చేయడంతో కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది.

News August 10, 2024

అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే బుడ్డా

image

ఎవరు కోరినా తాను కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, కావాలంటే చెక్ చేసుకోవచ్చని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సీతారామపురంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు ఆయన స్పందించారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందులు పడి టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

News August 10, 2024

సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కేఈ శ్యామ్ బాబు, బొగ్గుల దస్తగిరి, గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. గిరిజన సంక్షేమ కోసం పోరాడిన బిర్సా ముండా, అల్లూరి ఆదర్శప్రాయులన్నారు.

News August 9, 2024

కప్పట్రాళ్లను సందర్శించిన కర్నూలు ఎస్పీ

image

దేవనకొండ మండల పరిధిలోని కర్నూలు మాజీ ఎస్పీ, ప్రస్తుత ఐజీ ఆకే రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్లను శుక్రవారం సాయంత్రం ఎస్పీ జీ.బిందు మాధవ్ సందర్శించారు. ప్రజలతో ఎస్పీ మమేకమయ్యారు. ప్రజల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆకాంక్షించారు. ప్రశాంత జీవనానికి ప్రజలు ఎల్లప్పుడు ముందుండాలని పిలుపునిచ్చారు.

News August 9, 2024

పట్టుదలతో చదివి కలలను సాకారం చేసుకోవాలి: కలెక్టర్

image

పట్టుదలతో చదివి కన్న కలలను సాకారం చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం కర్నూలు బీ క్యాంప్‌లోని బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. క్లాస్ రూమ్‌లో 9, 10 విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.