Kurnool

News August 7, 2024

రైతుల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని 75 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని మరింత విస్తరించేందుకు వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం 100 రోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన, ఇరిగేషన్, పరిశ్రమలు, అటవీ, మైనింగ్, నీటి వనరులు, తదితర అంశాలపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతుల అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు.

News August 7, 2024

కేబినెట్ సమావేశంలో కర్నూలు జిల్లా మంత్రులు

image

ఏపీ CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూఖ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ భేటీలో CM చంద్రబాబు తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.

News August 7, 2024

తెలుగు రాష్ట్రాల హక్కులు కాపాడుకుందాం: శబరి

image

ఢిల్లీలో ఆంధ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎంపీలకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈక్రమంలో నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని సత్కరించారు. తెలుగు రాష్ట్రాల హక్కులు కాపాడుకునేందుకు కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పార్లమెంట్ వేదికగా ఏపీకి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు.

News August 7, 2024

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: జేసీ

image

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండులో నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. మంగళవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏర్పాట్ల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్, వేదిక, తదితర ఏర్పాట్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

News August 6, 2024

GGHకు పేషంట్ల తాకిడి పెరిగింది: డా.ప్రభాకర్ రెడ్డి

image

కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH)కు గత ఆరు నెలలతో పోలిస్తే జూలై నెలలో క్షేత్రస్థాయిలో ఓపిలు పెరిగాయని GGH సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజు 2700 నుంచి 3000 వరకు ఓపీలు జారీ చేస్తున్నామన్నారు. అత్యుత్తమ డాక్టర్లు, సిబ్బందిచే అధునాతన పరికరాలతో కూడిన వైద్య సేవలు, డయాగ్నొస్టిక్ సేవలను నిరంతరాయంగా అందించడం జరుగుతోందని స్పష్టం చేశారు.

News August 6, 2024

త్రిబుల్ ఐటీ కళాశాల సమస్యలను పరిష్కరించండి: ఎంపీ వినతి

image

కర్నూలులోని త్రిబుల్ ఐటీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్నూలు ఎంపీ నాగరాజు కోరారు. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ మాట్లాడుతూ.. త్రిబుల్ ఐటీ కళాశాలలో ఖాళీగా ఉన్న 36 బోధన, బోధనేతర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరినట్టు తెలిపారు.

News August 6, 2024

నంద్యాలలో ‘ఏం తీసుకెళ్లలేదు’ అంటూ చీటీ రాసిన దొంగ

image

నంద్యాల జిల్లా చాబోలులోని ఓ అగ్రికల్చల్ డ్రోన్ షాపులో ఓ దొంగ చోరీకి యత్నించాడు. అయితే దుకాణంలో డబ్బు దొరకకపోవడంతో ‘అన్నా.. చోరీకి వచ్చా. కానీ ఏమీ తీసుకెళ్లలేదు’ అంటూ ఓ చీటీపై రాసి అక్కడ వదిలి వెళ్లారు. దుకాణానికి వచ్చిన యజమాని నాగేశ్వర్ రెడ్డి ఆ చీటీ చూసి ఆశ్చర్యపోయారు. షాప్‌లో రూ.10 లక్షల విలువ చేసే సామగ్ర ఉందని దొంగ వాటిని చోరీ చేయలేదని చెప్పారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాజాగా వైరల్‌గా మారింది.

News August 6, 2024

మట్టి మిద్దె కూలిన ఘటన.. రూ.10 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

image

చాగలమర్రి మండలం చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి మరణించిన కుటుంబాన్ని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. తల్లిదండ్రుల మరణంతో అనాథ అయిన బాలిక ప్రసన్నకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. అక్కలా చూసుకుంటానని ధైర్యం చెప్పారు. ప్రసన్న చదువుపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చిస్తానని చెప్పారు. అలాగే బాలిక బాగోగులు చూసుకునే నాయనమ్మకు రూ.2 లక్షలు అందజేశారు.

News August 6, 2024

నంద్యాల జిల్లా హత్య ఘటన.. సీఐ, ఎస్ఐ సస్పెండ్!

image

నంద్యాల జిల్లా సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు హత్య ఘటనలో సీఐ, ఎస్ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు. రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ DIG కోయ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. హత్య అనంతరం డీఐజీ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే.

News August 6, 2024

9న నంద్యాల జిల్లాకు వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న నంద్యాల జిల్లాకు రానున్నారు. మహానంది మండలం సీతారామాపురంలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు జిల్లా వైసీపీ నేతలకు ప్రాథమిక సమాచారం అందింది.