Kurnool

News August 2, 2024

కలెక్టరేట్ ఏవోగా రాజేశ్వరి బాధ్యతల స్వీకరణ

image

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా రాజేశ్వరి గురువారం ఏవో ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సెక్షన్లలో పనులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది ఏవోకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

News August 1, 2024

పెన్షన్ పంపిణీలో కర్నూలు జిల్లా అగ్రస్థానం: కలెక్టర్

image

పెన్షన్ల పంపిణీలో కర్నూలు జిల్లా 97.96 శాతంతో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ రంజిత్ బాషా గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 2,43,337 పెన్షన్లు ఉండగా.. అందులో 2,38,372 పెన్షన్లను పంపిణీ చేశామని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న 4,965 పెన్షన్లను కూడా శుక్రవారం పంపిణీ చేస్తామన్నారు.

News August 1, 2024

స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపు

image

కర్నూలు నగరపాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లు విక్రమసింహా రెడ్డి, క్రాంతి కుమార్, జుబేర్ అహ్మద్, చిట్టెమ్మ మిద్దె, యూనూస్ బాషా గెలుపొందారు. టీడీపీకి సరైన బలం లేనప్పటికీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఎన్నికలలో నిలబడి ఓటమి పాలయ్యారు.

News August 1, 2024

ఆదోనిలో భారీ కుంభకోణాన్ని బయట పెట్టబోతున్నా: ఎమ్మెల్యే

image

ఆదోనిలో ఓ భారీ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో సహా బట్టబయలు చేస్తానని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆ కుంభకోణం ఏంటో, ఎవరు చేశారో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నియోజవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.

News August 1, 2024

కర్నూలు @85.49.. నంద్యాల @86.42%

image

కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పింఛన్ పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం 10 గంటలకు నంద్యాల జిల్లాలో 86.42, కర్నూల్ జిల్లాలో 85.49 శాతం పంపిణీ పూర్తయింది. నంద్యాల జిల్లాలో 2,19,863 మందికి గానూ 1,90,013 మందికి, కర్నూల్ జిల్లాలో 2,43,337 మందికి గానూ 2,08,029 మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు.

News August 1, 2024

పెన్షన్ పంపిణీ చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకను బాధ్యతగా ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులకు సూచించారు. గురువారం కల్లూరు మండలంలోని చిన్నటేకూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. వృద్ధులకు స్వయంగా పెన్షన్ అందజేశారు.

News August 1, 2024

శ్రీశైలానికి సీఎం.. నంద్యాల ఎస్పీ హై అలర్ట్

image

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రానికి ఇవాళ CM చంద్రబాబు రానున్నారు. కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా హై అలర్ట్ ప్రకటించారు. 11 సెక్టార్ల పరిధిలో 1100 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కాగా ఇప్పటికే శ్రీశైలం అడవులు అన్నింటినీ జల్లెడ పట్టినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా స్పష్టం చేశారు.

News August 1, 2024

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఎంపీ బైరెడ్డి శబరి

image

శ్రీశైల భ్రమరంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో పెద్దిరాజు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

News July 31, 2024

35 మంది సీఐలను బదిలీ చేసిన కర్నూలు రేంజ్ డీఐజీ

image

రాయలసీమ రేంజ్ (ZONE- 4) పరిధిలో 35 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 16 మంది సీఐలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కాగా ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఇద్దరు సీఐలకు పోస్టింగ్ లభించింది.

News July 31, 2024

కర్నూలు జిల్లాకు రూ.250 కోట్లు!

image

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రూ.1,750 కోట్లు కేటాయించింది. ఒక్కో జిల్లాకు రూ.250 కోట్లు రానున్నాయి. వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉన్న ఉమ్మడి కర్నూల్ జిల్లాకు కూడా రూ.250 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేయనుంది. ఈ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించనున్నారు.