Kurnool

News July 30, 2024

సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఖరారు

image

సీఎం చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం రానున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి నివాసం నుంచి 10.30 సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో శ్రీశైలం చేరుకొని మల్లన్న దర్శించుకొనున్నారు. అనంతరం డ్యామ్ వద్ద కృష్ణమ్మకు జల హారతి, తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. గత ఏప్రిల్ 22నే ఆయన శ్రీశైలం వచ్చారు.

News July 30, 2024

కర్నూలు: ఆస్తి వివాదం..సోదరుడి హత్య

image

అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఓ హత్యకు దారితీసింది. TG, రాజోలి(M) పెద్దధన్వాడకి చెందిన శేషిరెడ్డి, సోదరులు చిన్ననాగిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి మధ్య 20ఏళ్లుగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. చిన్నశేషిరెడ్డి తన సోదరులపై దాడికి పాల్పడినట్లు రాజోలిలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు <<13730370>>మృతదేహాన్ని<<>> బైక్‌పై తీసుకొచ్చి సి.బెళగల్(M) కొత్తకొటలో పడేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదుచేశారు.

News July 30, 2024

శ్రీశైల మల్లన్న సేవలో అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా

image

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు ఈవో పెద్దిరాజు, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం దేవస్థానం తరఫున శేష వస్త్రం, లడ్డు ప్రసాదాలు, జ్ఞాపికతో సత్కరించారు. ఆయన వెంట శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు ఉన్నారు.

News July 29, 2024

ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు?

image

సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లా అధికారులతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ జల వనరుల శాఖ అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యామ్ వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు జల హారతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు డ్యామ్ వద్ద తగు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

News July 29, 2024

కేబినెట్ సమావేశం.. పాల్గొననున్న జిల్లా మంత్రులు

image

రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 2న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూల్ జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఫరూక్ పాల్గొననున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.

News July 29, 2024

హోం మంత్రి అమిత్ షాను కలిసిన నంద్యాల ఎంపీ

image

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను సోమవారం కలిశారు. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ శబరి నంద్యాల పార్లమెంట్ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పార్లమెంట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేయగా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ శబరి తెలిపారు.

News July 29, 2024

పేరుకే బహుళార్థక సాధక ప్రాజెక్టు.. నిర్వహణకు నిధులు నిల్.?

image

కృష్ణానదిపై నిర్మించిన రెండో అతిపెద్ద ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు.అప్పటి ప్రధాని నెహ్రూ ముందుచూపు ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి ఆలోచన ఇంజినీర్ల మేథోశక్తి కలగలిపిన అద్భుత కట్టడం. ‘నేడు నిర్వాహణకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో అరకొర నిధులు మంజూరయ్యాయి. గ్రీజుకు కూడా అధికారులు డబ్బులు పెట్టుకునే దుస్థితి వచ్చింది. లిఫ్ట్ కూడా పనిచేయటం లేదు’ పలువురు విమర్శిస్తున్నారు.

News July 29, 2024

కర్నూలు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

సి.బెళగల్ మండలం కొత్తకోట గ్రామ సబ్ స్టేషన్ దగ్గర గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిపడి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బైక్ ఉంది. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారా లేక హత్య చేసి పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News July 29, 2024

ఆత్మకూరు: వేప చెట్టు నుంచి పాలు

image

వెంకటాపురంలోని ఉర్దూ స్కూల్ సమీపంలో ఆదివారం ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుంచి పాలు వస్తుండటంతో ఈ వింతను చూడటానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. చెట్టు బెరడులో నుంచి పాలు రావడం చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చక్కర్లు కొడుతోంది.

News July 29, 2024

కర్నూలు: డిగ్రీ రీవాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సముద్రాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మొత్తం 2,913 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 851 మంది ఉత్తీర్ణులు అయినట్లు పేర్కొన్నారు. ఫలితాలను https://www.rayalaseemauniversity.ac.inలో చూసుకోవచ్చని తెలిపారు.