Kurnool

News March 8, 2025

మహిళలు, బాలికల భద్రతే మా ద్యేయం: కర్నూలు ఎస్పీ

image

మహిళలు, బాలికల భద్రతే తమ ధ్యేయమని ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో పోలీసు కుటుంబాల మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మహిళలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

News March 8, 2025

కర్నూలు జిల్లాలో 610 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా నేడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్‌ పేపర్ 1బి, జువాలజీ పేపర్‌ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలు జరిగాయి. 610 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 22,348 మంది హాజరు కావాల్సి ఉండగా 21,738 మంది పరీక్ష రాశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు.

News March 8, 2025

పోసానిని కస్టడీకి ఇవ్వండి: ఆదోని పోలీసులు

image

కర్నూలు జిల్లా జైలులో ఉన్న నటుడు పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ <<15653795>>ఆదోని<<>> పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. కర్నూలు మొదటి అదనపు జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ అపర్ణ దీనిపై విచారణ చేపట్టారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరారు.

News March 7, 2025

నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

image

వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరపాలక సంస్థ ఎస్ఈని ఆదేశించారు. శుక్రవారం కర్నూలు నగర శివార్లలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మీడియాకు వెల్లడించారు.

News March 7, 2025

విద్యార్థులకు పక్కాగా భోజనాన్ని అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని కలెక్టర్ పి.రంజిత్ భాష ఆదేశించారు. శుక్రవారం కర్నూల్ నగరంలోని ఎస్ఎపీ క్యాంప్‌లోని నగర పాలక ఉన్నత పాఠశాలను సందర్శించి, మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు సులభంగా గణితం అర్థమయ్యేందుకు టిప్స్ సైతం  అందించారు. అనంతరం విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు.

News March 7, 2025

కర్నూలు జిల్లాలో ఇద్దరు విద్యార్థుల డీబార్

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ రెండో సంవత్సర విద్యార్థులకు నేడు పార్ట్‌ 3లోని సబ్జెక్టుల పరీక్షలు జరిగాయి. చూచిరాతలకు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. 20,864 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 414 మంది గైర్హాజరు అయ్యారు. బి.క్యాంప్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలలోనే డీబార్ అయినట్లు తెలిపారు.

News March 7, 2025

ఫ్రీ జర్నీ జిల్లాకే పరిమితం.. మీ కామెంట్

image

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అయితే ‘ఏ జిల్లా మహిళలకు.. ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం’ అని మంత్రి సంధ్యారాణి మండలిలో ప్రకటన చేశారు. ఈ లెక్కన కర్నూలు, నంద్యాలలోని మహిళల ఉచిత ప్రయాణాలు ఆ జిల్లాల వరకే పరిమితం అవుతాయి. పక్క జిల్లాలో ప్రయాణించాలంటే బార్డర్ నుంచి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మీ కామెంట్..

News March 7, 2025

టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

image

కర్నూలు జిల్లాలోని బీసీ, కమ్మ, ఈబీసీ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బలిజ కులాల మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ హుస్సేన్ తెలిపారు. శిక్షణ అనంతరం కుట్టు మిషన్లను అందజేస్తామని చెప్పారు. ఆయా కులాలకు చెందిన 18-50ఏళ్ల మహిళలు తమ పరిధిలోని సచివాలయాల ద్వారా apobmms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99081 32030 నంబరుకు సంప్రదించాలన్నారు.

News March 7, 2025

భర్త చేతిలో గాయపడిన భార్య మృతి

image

ఉమ్మడి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో భర్త వెంకటరామిరెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య విద్య మనోహరమ్మ బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్యపై అనుమానం పెంచుకొని, తాగిన మైకంలో వెంకట్రామిరెడ్డి రోకలి బండతో భార్యపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న మనోహరమ్మను బనగానపల్లెకు తరలించగా మృతి చెందినట్లు సీఐ రమేశ్ బాబు తెలిపారు.

News March 6, 2025

ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

image

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్‌లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.