Kurnool

News July 12, 2024

తెలంగాణ సీఈవోగా కర్నూలు మాజీ కలెక్టర్‌

image

ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ కలెక్టర్‌ సీ.సుదర్శన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)గా ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కాగా 2012 నుంచి 2014 వరకు సుదర్శన్ రెడ్డి కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. ఇప్పటివరకు TG సీఈఓగా ఉన్న వికాస్ రాజ్ కూడా గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

News July 12, 2024

జనసేన పార్టీ నాయకులు వర్గ విభేదాలు వీడండి: లక్ష్మన్న

image

జనసేన నాయకులు వర్గ విభేదాలు వీడాలని జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లక్ష్మన్న కోరారు. మంత్రాలయంలోని పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలు వీడి కలిసికట్టుగా పార్టీ అభ్యున్నతి కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. అధిష్ఠానం మేరకే 4 మండలాల అధ్యక్షులను నియమించామని పేర్కొన్నారు.

News July 12, 2024

నంద్యాల-ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై భారీ కంటైనర్ బోల్తా

image

నంద్యాల-ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై ఎర్రగుంట్ల సమీపంలో గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. కడప వైపు వెళ్తుండగా ఎర్రగుంట్ల వద్దకు రాగానే అదుపు తప్పి రహదారిపై పడింది. ఆ సమయంలో రహదారిపై ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

News July 12, 2024

కర్నూలు: ఉద్యోగ మేళాలో 37 మంది ఎంపిక

image

నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి పేర్కొన్నారు. గురువారం ఉపాధి కల్పనా కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. అనంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరామ్ చిట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మేళాకు 74 మంది హాజరు కాగా.. అందులో 37 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు.

News July 12, 2024

డిగ్రీ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

కర్నూలు: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు రిజిస్ట్రార్ బాయినేని శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. https:///oamdc-apsche.aptonline.in /OAMDC202425/Index ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఆగస్టు 1వ తేదీ లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు.

News July 12, 2024

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి జిల్లాలోని బీడి, సున్నపురాయి, డోలమైట్ గని కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని బీడి కార్మిక సంక్షేమ నిధి వైద్యశాఖ అధికారి డాక్టర్ కిషోర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్మికుల పిల్లలు ఆన్లైన్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులు అక్టోబరు 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 12, 2024

32,255 మంది కౌలు రైతులకు CCRC కార్డులు పంపిణీ చేయాలి: జేసీ

image

కర్నూలు జిల్లాలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతులకు సకాలంలో CCRC కార్డులు పంపిణీ చేయాలని JC నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాకు 22 వేల మంది కౌలుదారులకు CCRC కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. అయితే జిల్లాలో ఆ సంఖ్యను 32,255కు పెంచామని తెలిపారు.

News July 12, 2024

మంత్రి లోకేశ్‌ను కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే

image

మంత్రి నారా లోకేశ్‌ను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గురువారం కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను లోకేశ్‌కు వివరించారు. టీడీపీ నాయకుడి హత్య అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడుకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్యామ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News July 12, 2024

నందికొట్కూరు నియోజకవర్గంలో నేడు విద్యాసంస్థల బంద్

image

పగిడ్యాల మండలంలో బాలిక హత్యాచార ఘటనకు నిరసనగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. బాలిక కుటుంబానికి న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరూ బంద్‌కు కలిసి రావాలని అన్నారు.

News July 12, 2024

ఉపాధి పనులు కల్పించడంలో కర్నూలు జిల్లా వెనుకబడి ఉంది:కలెక్టర్

image

ఉపాధి పనులు కల్పించడంలో కర్నూలు జిల్లా వెనుకబడి ఉందని కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. అర్హులైన పేదలందరికీ పనులు కల్పించాలని డ్వామా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉపాధి హామీ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.