Kurnool

News July 11, 2024

పెద్దపులి పాదముద్రల గుర్తింపు

image

నంద్యాల జిల్లాలోని మహానంది, రుద్రవరం మండలాల్లో కొంతకాలంగా చిరుత పులి సంచారంతో బెంబేలెత్తిన జనాలకు.. ఇప్పుడు పెద్దపులి భయం పట్టుకుంది. బుధవారం రుద్రవరం మండలం చెలిమ ఫారెస్టు రేంజ్‌లోని కోటకొండ పొలాల్లో పెద్దపులి సంచరించినట్లు రైతులు గుర్తించారు. పెద్దపులి పాదముద్రలు స్పష్టంగా కనిపించాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని అన్నారు.

News July 11, 2024

లభించని బాలిక ఆచూకీ

image

పగిడ్యాల మండలం ఎల్లాలలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. నిన్న చీకటిపడే వరకు గాలించినా ఫలితం లేదు. పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, హత్యచేసి హంద్రీనీవా కాలువలో పడేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. వారిని గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్‌ సమీపంలో పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు.

News July 11, 2024

ఈనెల 19న కర్నూలు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 19న జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ జీ.నాసర రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్లు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు హాజరవుతారన్నారు.

News July 11, 2024

15న జిల్లాస్థాయి సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు

image

ఈ నెల 15న ఔట్‌డోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సీనియర్స్ సాప్ట్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం కార్యదర్శి విజయ్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరచిన వారు ఆగస్టు నెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 4 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావచ్చని వెల్లడించారు.

News July 10, 2024

బనగానపల్లెలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

image

టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామమైన బనగానపల్లె మండలం యనకండ్లలో గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. చేయి విరగ్గొట్టి, ముఖానికి తారు పూశారు. బత్తులూరులో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌కు వైఎస్ జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ఫొటోలకు బ్లాక్ రంగుతో శిలాఫలకాలు నాశనం చేశారు.

News July 10, 2024

కర్నూలు: ఎడారిగా మారిన తుంగభద్ర నది

image

వర్షాభావం వల్ల తుంగభద్ర నది ఎడారిగా మారింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం నదిచాగి పంచాయతీ పరిధిలో తుంగభద్ర నది ఆంధ్రలో ప్రవేశిస్తుంది. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటివరకు నదిలో నీళ్లు లేక ఎడారిగా మారింది. నది తీరాన ఉన్న రైతులు వరి సాగు కోసం నారుమళ్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఆనకట్ట పైభాగాన వర్షాభావంతో నీటి నిల్వ గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని డ్యాం అధికారులు తెలిపారు.

News July 10, 2024

నంద్యాల: గుండెపోటుతో ఉద్యోగి మృతి

image

నంద్యాల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కాకర్ల వెంకట రామారావు గుండెపోటుతో మృతిచెందారు. ఇవాళ ఉదయం తన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే చనిపోయారు. వీరి స్వస్థలం గిద్దలూరు మండలం రాజుపేట గ్రామం. చిన్న వయసులోనే ఆయన మృతిచెందారని పలువురు ఉద్యోగులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం రాజుపేట గ్రామంలో జరుగుతాయని బంధువులు వెల్లడించారు.

News July 10, 2024

కర్నూలు జిల్లాలో తొమ్మిది మందిపై వేటుకు రంగం సిద్ధం!

image

కర్నూలు జిల్లాలోని అటవీ శాఖ పరిధిలో తొమ్మిది మంది ఉద్యోగులు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాలోని పర్యావరణ విధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తన పరిధిలోని నలుగురికి డీఎఫ్‌వో ఛార్జిమెమోలు జారీ చేశారు. అటవీ ప్రాంతాన్ని పరిరక్షించడంలో పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు సమాచారం. దీంతో మొత్తంగా తొమ్మిది మందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది.

News July 10, 2024

కోడుమూరు మండలంలో గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి

image

కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అచ్చిరెడ్డిగారి ఈశ్వరరెడ్డి (55) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మధ్యాహ్నం ఇంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఈశ్వరరెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కోట్ల హర్షవర్దన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News July 10, 2024

హిజ్రాను మోసం చేసిన కర్నూల్ జిల్లా యువకుడు

image

కర్నూల్ జిల్లా యువకుడు హిజ్రాను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. హైదరాబాద్‌ నగరానికి చెందిన హిజ్రా హసీనా గౌడ్‌తో ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన గణేశ్ కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీరా మోసం చేయడంతో హసీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌ తరలించారు.