India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరా వేళ బిగ్ సేల్ ఆఫర్లతో వచ్చే సోషల్ మీడియా ప్రకటనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ నేరగాళ్లు తక్కువ ధరల్లో వస్తువులు అంటూ లింకులు పంపిస్తున్నారన్నారు. వాటిని క్లిక్ చేస్తే ద్విచక్ర వాహనాలు, కార్లు గెలుస్తారని మభ్యపెట్టి మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు.
కర్నూలు కలెక్టర్‌గా సిరి నియమితులయ్యారు. శ్రీకాకుళం(D) టెక్కలికి చెందిన ఈమె విశాఖలో MBBS చదివారు. గ్రూప్-1 పరీక్షలు రాసి 2007లో పాలకొండ RDOగా బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో విజిలెన్స్ విభాగం, తూ.గో జిల్లా SC కార్పొరేషన్ ED, విశాఖ జిల్లా పర్యాటక అధికారి, విశాఖ జేసీ-2, ప్రకాశం జిల్లా జేసీ-2, అనంత జిల్లా జేసీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు.
కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. అందుకు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మండలాల ఏర్పాటు, గ్రామాల పేర్ల మార్పులు, సరిహద్దులపై ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించి నివేదిక ఇవ్వనుంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో కర్నూలు నుంచి విడిపోయి ఆదోని కొత్త జిల్లాగా ఏర్పడితే మీ మండలం జిల్లాలో ఉండాలనుకుంటున్నారు? కామెంట్.
కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడి తెలిసిందే. ప్రాణాలకు తెగించి పనిచేస్తూ పొట్ట నింపుకునే వారు ఎందరో ఉన్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ పని వెనుక ఉన్న శ్రమ తెలుసు. అయితే నంద్యాల జిల్లా గడివేముల మండలంలో 760 కేవీ విద్యుత్ లైన్ పనులు జరుగుతున్నాయి. కొంతమంది శ్రామికులు ఆకాశమంత ఎత్తులో విద్యుత్ వైర్ల పనులు చేస్తున్న దృశ్యాన్ని Way2News క్లిక్ మనిపించింది. ఈ చిత్రం శ్రమైక్య జీవన సౌందర్యానికి నిదర్శనం.
ఈ నెల 13న కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, ప్రీ-లిటిగేషన్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
కర్నూలు జిల్లా నూతన కలెక్టర్‌గా డా.అట్టాడ సిరి నియమితులయ్యారు. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ రంజిత్ బాషాను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా బదిలీ అయ్యారు. జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఎ.సిరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు మార్కెట్ యార్డులో గురువారం ఉదయం లెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యటించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు అమ్మకానికి తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అమ్మకానికి వచ్చిన ఏ ఒక్క రైతుకూ నష్టం కలగకుండా వారికి సహకరించాలన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎస్సీ కార్పొరేషన్ ఉచిత హెవీ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బుధవారం కర్నూలులోని కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసి ఇంటర్వ్యూలు నిర్వహించారు. 10 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేయగా, అందులో 18 మంది హాజరయ్యారని చెప్పారు. అర్హులైన పది మందిని ఎంపిక చేయగా వారిలో ఒక మహిళ ఉన్నట్లు ప్రకటించారు.
దేవనకొండలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ రంజిత్ భాష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉండే రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రంతో పాటు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రాలకు సంబంధించిన రికార్డులను చూశారు. మండల వైద్యాధికారి, సీఐ వంశీనాథ్, ఆర్డీవో భరత్ నాయక్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.