India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటలో కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువై దట్టమైన పొగ మంచు కమ్మేసి మనుషుల్నే కాదు జంతువులను సైతం వణికిస్తోంది. దీంతో మనుషులే కాదు పశువులు సైతం చలికాచుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పచ్చని పచ్చిక బయళ్లలో, పశుశాలల్లో పెరగాల్సిన గోవులను వాటి యజమానులు రోడ్ల మీద వదిలివేయడంతో అవి దయనీయ స్థితిలో బతుకుతున్నాయని పశు ప్రేమికులు వాపోతున్నారు.

బాలిక(13)పై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదివే ఓ బాలిక రోజూ ఆటోలో స్కూల్‌కి వెళ్తోంది. స్కూల్ ఆటో నడిపే సతీశ్ బాలికను బీచ్‌కి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆటోడ్రైవర్ స్నేహితుడు సునీల్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులపై పొక్సో కేసు నమోదు చేశారు.

యువకులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ తెలిపారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల సమాజంలో గౌరవం పోతుందన్నారుతల్లిదండ్రులు కూడా నిరంతరం తమ బిడ్డలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల అమ్మకాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 నంబర్‌కు తెలపాలని సూచించారు.

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నామినేటెడ్ పోస్టులు వంటి పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఫరూక్, ఆనం రాంనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, పోలిట్ బ్యూరో సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నెల్లూరులో శనివారం కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా రెండేళ్ల క్రితం చిన్నా సోదరుడు సాయిపై కొందరు కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపేశారు. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారులు హత్యకు గురి కావడంతో వారి తల్లి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కాగా ఇప్పటికే చిన్నా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం GGHకు తరలించారు.

నేడు(ఆదివారం) ఆత్మకూరులో ఐదుగురు మంత్రుల బృందం పర్యటిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. మంత్రులు ఫరూక్, సవిత, బీసీ జనార్దన్, నారాయణ వారిలో ఉన్నారు. టిడ్కో నివాస ప్రాంతాల్లో సీతారామ ఆలయ నిర్మాణం, పంచాయతీరాజ్ నూతన అతిథి భవన నిర్మాణానికి శంకుస్థాపన, R&B నూతన అతిథిగృహ ప్రారంభం, జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను వారు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

నెల్లూరు నగరంలో శనివారం దారుణ హత్య జరిగింది. నవాబుపేట PS పరిధిలోని ఉడ్ హౌస్ ప్రాంతానికి చెందిన కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నాపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిపై నవాబుపేట PSలో సస్పెక్ట్ రౌడీ షీటర్ నమోదైనట్లు పోలీసులు తెలిపారు. DSP సింధుప్రియా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని సిద్ధంగా ఉన్నాయని RIO శ్రీనివాసులు తెలిపారు. శనివారం D.K బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎగ్జామినర్ల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణ కోసం అన్ని సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లోని ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండడంతో ఇంజెక్షన్ వేసేందుకు కార్తీక్ అనే కాంపౌండర్ వచ్చాడు. ఇంజెక్షన్ వేస్తున్నట్లు నటిస్తూ సమీపంలో బంగారు ఆభరణాలు గమనించి చోరీకి పాల్పడ్డాడు. బంగారం దొంగిలించినట్లు గమనించిన ఉదయ శేఖర్ రెడ్డి దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో తీసుకొని 95 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. కలెక్టర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావలి సెల్ఫీ పాయింట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెంగళరావునగర్‌లో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.