Nellore

News January 27, 2026

నెల్లూరు: సినిమా బండి.. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.!

image

‘నేడే చూడండి’ అంటూ బుచ్చిరెడ్డిపాలెంలో నేటికి సినిమా బండి ద్వారా ప్రచారం జరుగుతుండడం కాసింత ఆశ్చర్యం కలుగుతుంది కదా!. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా రిక్షా(సినిమా బండి)లో ప్రచారం చేస్తుండడంతో పాత రోజులు గుర్తుచేస్తున్నారని వీక్షకులు అంటున్నారు. మీ ఊరిలో కూడా ఇలానే ఉంటుందా కామెంట్ చెయ్యండి.

News January 27, 2026

నెల్లూరు: నమ్మారో.. బురిడీ కొట్టిస్తారు..!

image

నెల్లూరు కేంద్రంగా ఫుడ్ ప్రాంచైజీ పేరుతో గ్రామీణ హోమ్ ఫుడ్స్ రూ.70 Cr, కావలిలో అనంతార్ధ అసోసియేట్స్ సంస్థ ప్రతినిధి అధిక వడ్డీలు ఇస్తామని రూ. 78 Crతో పరారయ్యాడు. ఓ యువకుడిని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు. 2024లో 357 వైట్ కాలర్ మోసాలు జరగగా.. 2025లో 457కు పెరిగాయి. ఆన్‌లైన్ వేదికగా 2025లో రూ.23.57 కోట్లని సైబర్ క్రిమినల్స్ దోచేశారు. మాయగాళ్ల మాటలకు బోల్తా పడ్డారో.. బురిడీ కొట్టిస్తారు.

News January 27, 2026

నెల్లూరు: నగరవనాలకు మోక్షం కలిగేనా..?

image

ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించేందుకు ఏర్పాటు చేస్తున్న నగర వనాల అభివృద్ధి ఆగిపోయింది. కావలి, చేవూరు, ముంగమూరు, నెల్లూరు, వెంకటాచలం, నరసింహాకొండ ప్రాంతాల్లో నగర వనాల ఏర్పాటు నిధులు లేమితో మధ్యలోనే పడకేశాయి. ఒక్కో దాన్ని రూ. 2 కోట్లతో అభివృద్ధి చేయాల్సి ఉండగా పూర్తి చేయలేదు. అయితే.. వీటి పనులకు ఒక్కో దానికి రూ. 60 లక్షలు నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. పూర్తి చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

News January 27, 2026

నెల్లూరు: ఆసుపత్రికి వస్తారు.. వెళ్తారు!

image

నెల్లూరు జిల్లాలో ఉద్యోగులు సరిగా <<18972466>>పనిచేయడం లేదనే <<>>ఆరోపణలు ఉన్నాయి. ఉదయగిరి(M) గండిపాలెం ఆసుపత్రిలో గతంలో విద్యుత్తు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఉదయగిరి ఆసుపత్రిలో ఓ రూము తీసుకుని సిబ్బంది పనిచేస్తున్నారు. గండిపాలెంలో రిపేర్లు పూర్తి అయినప్పటికీ.. ఇక్కడ పనిచేయకుండా వాక్సినేషన్ పేరుతో ఉదయగిరిలోనే ఉంటున్నారు. గండిపాలెం ఆసుపత్రిలో బయోమెట్రిక్ వేసి వెళ్లిపోతుండటంతో రోగులకు సేవలు అందడం లేదు.

News January 27, 2026

చంపేస్తామంటూ నెల్లూరులో కత్తులతో హల్‌చల్

image

నెల్లూరు రూరల్ కోడూరుపాడు కల్తీ కాలనీలో సోమవారం ఓ విద్యార్థిపై దాడి జరిగింది. మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బైకుపై స్కూల్లోకి వచ్చారు. ఎందుకు లోపలకు వచ్చారని 10వ తరగతి విద్యార్థి ప్రశ్నించడంతో వెళ్లిపోయారు. తర్వాత కాలనీ బయట ఆ విద్యార్థిపై యువకులు దాడి చేశారు. తమ జోలికి వస్తే చంపేస్తామని కత్తులు బయటకు తీసి భయపెట్టారు. యువకులను గుర్తించే పనిలో ఉన్నామని రూరల్ CI వేణు Way2Newsకు వివరించారు.

News January 27, 2026

NLR: గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల ప్రారంభం

image

నెల్లూరు జిల్లాలోని వివిధ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 5, 6, 9వ తరగతి, ఇంటర్‌లో చేరాలనకునే వాళ్లు ఫిబ్రవరి 19వ తేదీలోపు apgpcet.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంగంలోని బాలికల గురుకులంలో 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్ ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయని ప్రిన్సిపల్ సుమతమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

News January 27, 2026

నెల్లూరు పర్యాటక శకటానికి దక్కిన బహుమతి

image

నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండులో సోమవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పర్యాటక శాఖ శకటానికి బహుమతి దక్కింది. ఉదయగిరి కోట, మైపాడు సముద్రతీరం అంశాలను శకటoలో ప్రదర్శించగా అందరి చూపు ఉదయగిరి కోటపై నిలిచింది. ఉదయగిరి దుర్గం, దానిపై ఉన్న ప్రాచీన కట్టడాల నమూనాలు వేడుకల్లో పాల్గొన్నవారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. కలెక్టర్ నుంచి పర్యాటకశాఖ అధికారి ఉషశ్రీ బహుమతి పొందారు.

News January 26, 2026

గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న సాంస్కృతిక, శకటాల ప్రదర్శన

image

నెల్లూరు పెరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన అలరించాయి. దేశభక్తిని పెంపొందించేలా దేశమంటే మట్టికాదోయ్ నృత్య రూపకం అందరినీ ఆకట్టుకోగా హమారా హిందుస్తానీ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన పరిశీలించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు.

News January 26, 2026

నెల్లూరు: 1070 మందిలో ఫ్లోరోసిస్ ప్రభావం

image

వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ సంయుక్తంగా చేపడుతున్న ఫ్లోరోసిస్ సర్వేలో 1070 మందిని అనుమానిత కేసులుగా గుర్తించారు. నవంబర్ నుంచి 6 నెలలపాటు జరిగే ఈ సర్వేలో 3,4,5 తరగతుల పిల్లల్లో, పంచాయతీ స్థాయిలో 20 హౌసెస్లలో చేపట్టిన సర్వేలో వారి నుంచి యూరిన్ శాంపిల్స్ పరీక్షించునున్నారు. జిల్లాలో వీకే పాడు, దుత్తలూరు, ఉదయగిరి, కొండాపురం, కలిగిరి, వింజమూరు వంటి మెట్ట ప్రాంతాల్లో ఈ సర్వే జరుగుతోంది.

News January 26, 2026

నెల్లూరు జెండా ఎగురవేసిన కలెక్టర్

image

నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఎస్పీ డాక్టర్ అజిత వెజండ్లతో కలిసి జెండా వందనం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్, ఎస్పీ కలిసి శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ వేడుకలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.