India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు రేపు జరగనున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ ASP దీక్ష ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలను ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసు బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల సహకారంతో విస్తృతంగా నిర్వహించారు.

సోమవారం నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే 77వ గణతంత్ర వేడుకలకు సంబంధించి కార్యక్రమం వివరాలు I&PR కార్యాలయం విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల జెండా ఆవిష్కరణ చేయనున్నారు. కలెక్టర్ సందేశం, శకటాల ప్రదర్శన, విద్యార్థిని, విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత జాతీయ గీతాలాపనతో ముగుస్తుందన్నారు.

గణతంత్ర దినోత్సవం, రథసప్తమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ దేవాలయాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచామన్నారు.

వరికుంటపాడు(M) తూర్పు రొంపిదొడ్లలో ఆదివారం విషాదం నెలకొంది. కందిచేనుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చనిపోయారు. స్థానికుల వివరాల మేరకు.. గ్రామ సమీపంలోని బోణిగాలరావుపాడులో కందిచేను చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ST కాలనీకి చెందిన ఇద్దరు బైకు మీద వెళుతూ.. వాటికి తగిలారు. దీంతో బైకు దగ్ధమవ్వగా ఇద్దరూ చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒక్కో ఘట్టం ఆధ్యంతం కడు రమణీయంగా సాగుతోంది. ఆ శ్రీమన్నారాయణుడి వేడుకల వైభవాన్ని కనులారా వీక్షించడానికి దేవలోకమే దిగివచ్చినట్లు ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామి వారి సేవలో మైమరచిపోయారు.

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.

అభివృద్ధి పనుల్లో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల పనులను వేగవంతం చేసి, జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేయాలని స్పష్టం చేశారు.

Sorry, no posts matched your criteria.