Nellore

News July 17, 2024

రొట్టెల పండుగకు తొలిరోజు లక్షమందికి పైగా హాజరు: అధికారులు

image

నెల్లూరు బారాషహీద్ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండుగకు తొలి రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ శర్మద ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు చేపట్టారు.

News July 17, 2024

నెల్లూరు: అడవిలో అనుమానస్పద స్థితిలో బాలిక మృతి

image

దొరవారి సత్రం మండలం నేషనల్ హైవే నెలబల్లి రైస్ మిల్ పక్కనే ఉన్న అడవిలో బాలిక మృతదేహం లభ్యమైంది. మృతురాలు నెలబల్లి రైస్ మిల్లులో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న కూతురుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. రైస్ మిల్లులో పనిచేసే కార్మికులను, చుట్టు పక్కలవారిని విచారించారు.

News July 17, 2024

నెల్లూరు: తొలిరోజే బారాషహీద్ దర్గా కిటకిట

image

నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ ప్రారంభమైంది. తొలి రోజు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. బారాషాహిద్‌లను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా విచ్చేసిన భక్తులతో దర్గా పరిసరాలు జన సందడిగా మారిపోయాయి. ఈ ఏడాది సుమారు పది లక్షలు పైగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

News July 17, 2024

నెల్లూరు: యువకుడిపై దాడి..ట్విస్ట్ ఏంటంటే?

image

తడలో యువకుడిపై దాడి కలకలం రేపింది. తునికి చెందిన సతీశ్ కుమార్ శ్రీసిటీలో పనిచేస్తున్నాడు. కాకినాడకు చెందిన మోనికకు పదేళ్ల క్రితం రవీంద్రబాబుతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విడిపోయిన ఆమె తడకు వచ్చి 4 నెలలుగా సతీశ్‌తో సహజీవనం చేస్తోంది. సతీశ్ డ్యూటీకి వెళ్తుండగా ఒకరు ఇనుప రాడ్‌తో దాడి చేసి పారిపోయాడు. అతని ముఖ కవలికల ఆధారంగా రవీంద్రబాబునే దాడి చేశాడని మోనిక అనుమానిస్తోంది.

News July 17, 2024

రొట్టెల పండుగ కోసం ట్రాఫిక్ ఆంక్షలు

image

వాహన రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. • చెన్నై, బెంగళూరు, తిరుపతి నుంచి గూడూరు మీదుగా వచ్చే, పొదలకూరు రోడ్డు నుంచి వచ్చే బస్సులను అయ్యప్పగుడి సెంటర్ మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి, బీవీ నగర్, రామలింగాపురం, మార్కెట్ ఆర్టీసీకి మళ్లించారు. జొన్నవాడ వైపు నుంచి వచ్చే బస్సులను పుత్తా ఎస్టేట్, సెయింట్ జోసెఫ్ స్కూల్ మీదుగా మళ్లించారు. కేవీర్ పెట్రోల్ బంక్ నుంచి వెళ్లడానికి అనుమతి లేదు.

News July 17, 2024

రొట్టెల పండుగ పార్కింగ్‌ ప్రాంతాలివే

image

బెంగళూరు, చెన్నై వయా గూడూరు నుంచి వచ్చేవి జిల్లా ఆసుపత్రి ప్రాంగణం, సుబ్బారెడ్డి మైదానం దగ్గర నిలపాలి. కావలి వైపు వచ్చేవారు ఎస్‌వీజీఎస్‌ కళాశాల మైదానంలో కార్లు, ఆటోలు నిలపాలి. కడప నుంచి జొన్నవాడ మీది వాహనాలకు డీఎస్‌ఎన్‌ ఫంక్షన్‌ హాల్‌ పక్కన, ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం కేటాయించారు. రాపూరు మీదుగా వచ్చేవి తెలుగుంగ కాలనీ, పొదలకూరు రోడ్డులోని జడ్పీ బాలికల పాఠశాలలో నిలపాలి.

News July 17, 2024

నెల్లూరు: పొగాకు విత్తనాలు సిద్ధం

image

రైతులకు 2024-25 పంట కాలానికి సంబంధించి పొగాకు విత్తనాలు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. సొంత నారుమడి పెట్టుకునే రైతులకు సీటీఆర్ రాజమండ్రి, కమర్షియల్ నారుమడి కోసం సీటీఆర్ కందుకూరులో పొగాకు విత్త నారను సరఫరా చేస్తామన్నారు. ఒక బ్యారన్ ‌కు 500 గ్రాములు రూ.600 చొప్పున కమర్షియల్ నారుమడికి కిలో రూ.1,8000 విక్రయిస్తున్నట్లు తెలిపారు.

News July 17, 2024

దగదర్తి ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు

image

నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దగదర్తితో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా చిన్నతరహా ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం కోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు సూచించాయి.

News July 16, 2024

భర్త మృతితో మనస్తాపానికి గురై ఆత్మహత్య

image

భర్త మృతితో మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరికుంటపాడు(M), కనియంపాడులో మంగళవారం చోటుచేసుకుంది. ఇటివల కోడూరు బీచ్ జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన కొద్ది రోజులకే కర్ణాటకలోని KGFలో బంధువుల వద్ద ఉన్న జాన్ బాబు భార్య తన భర్త మృతితో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో హెయిర్ ఆయిల్ సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 16, 2024

డక్కిలి గురుకుల ప్రిన్సిపల్ సస్పెండ్

image

డక్కిలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఇటీవల అనారోగ్యంతో సరీనా మృతి చెందిన విషయం తెలిసిందే. విధులు సక్రమంగా నిర్వహించలేదని ప్రిన్సిపల్ శ్రీదేవి , హౌస్ టీచర్ వాణి , ఆరోగ్య కార్యకర్త సునీతలను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాల బాలిక మృతిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కలెక్టరుకు నివేదిక పంపడంతో కలెక్టర్ వారిపై చర్యలు తీసుకున్నారు.