Nellore

News January 23, 2026

ఉదయగిరి: ‘సాయంత్రం 6 గంటల తర్వాత అటువైపు వెళ్లొద్దు’

image

ఉదయగిరి – బండగానిపల్లి ఘాట్ రోడ్డు వైపు సాయంత్రం 6 గంటల తర్వాత అటువైపు వెళ్లొద్దని ఉదయగిరి రేంజ్ అధికారి BS కుమార్ రాజా తెలిపారు. శుక్రవారం కొండ కింద గ్రామాలలో అటవీ, పోలీస్, రెవెన్యూ, ఎంపీడీవో అధికారులు సందర్శించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసరం అయితే మాత్రమే గుంపుగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాలని, మూగజీవాలను అడవిలోకి తీసుకు వెళ్లొద్దని సూచించారు.

News January 23, 2026

నెల్లూరు: సాగు మొదలైనా.. భూసార నివేదికలు ఎక్కడ?

image

జిల్లాలో వరి సాగు దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా జరుగుతోంది. సాగు మొదలై రెండో నెల అవుతున్నా భూసార నివేదికలు రైతన్నలకు అందలేదు. 31,231 నేల పరీక్షలు లక్ష్యం కాగా 30,785 నమూనాలు సేకరించారు. వీటిలో 23,306 శాంపిల్స్ పరీక్షించగా 14,104 SOIL హెల్త్ కార్డ్స్‌ను అందించారు. నేల స్వభావాన్ని అనుసరించి ఎరువుల వినియోగం జరగని పరిస్థితులు వెంటాడుతున్నాయి. మిగిలిన కార్డ్స్ అందించే లోపు సాగు పూర్తయ్యే అవకాశాలున్నాయి.

News January 23, 2026

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి: కలెక్టర్

image

అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్యోగుల అందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల నమోదు పెంచడం, ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, యువతను ఓటరుగా నమోదుకై ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

News January 23, 2026

కందుకూరు LICలో రూ.3 కోట్లు స్కాం

image

కందుకూరు LICలో భారీ స్కాం బయటపడింది. పూర్వాశ్రమంలో ఏజెంట్‌గా ఉండి తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్‌గా మారిన పూజల శ్రీనివాస్ పథకం ప్రకారం స్కాంకు పాల్పడ్డాడు. దొంగ పాలసీలు చేయించి నకిలీ డెత్ సర్టిఫికెట్లతో రూ.కోట్లు కాజేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందని సమాచారం. ప్రాథమిక విచారణలో రూ.3 కోట్లు కాజేసినట్లు తెలుస్తోంది. కొత్త సాప్ట్‌వేర్‌తో ఈ స్కాం బయటపడిందని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 23, 2026

ఎయిడెడ్ పోస్టుల భర్తీకి 25, 27న పరీక్షలు: DEO

image

గూడూరులోని SPS UP స్కూల్లో ఎయిడెడ్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు 25, 27వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను cre.ap.gov.in వెబ్సైట్ నుంచి తమ మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోలేని అభ్యర్థులు తిరుపతిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News January 23, 2026

నెల్లూరు GGHలో శవాలను తినే రాబందులు!

image

నెల్లూరు GGHలో కొందరు డాక్టర్లు శవాలపై సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డెడ్‌బాడీలకు పోస్ట్‌మార్టం చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఓ SIని సైతం లంచం డిమాండ్ చేయడం విస్తుపోయేలా చేస్తోంది. కొత్తవంగల్లులో 3ఏళ్ల క్రితం సుశీలమ్మ మరణించింది. ఇటీవల హత్య అని తేలడంతో SI రీపోస్టుమార్టం కోసం GGHకు వెళ్లగా రూ.30 వేలు డిమాండ్ చేశారట. ఆయన దీనిపై ఫిర్యాదు చేసినట్లు అధికారులకు తెలుస్తోంది.

News January 23, 2026

నెల్లూరు: జవాన్‌పై దాడి.. ఇరు వర్గాలపై కేసు

image

BSF జవాన్ జోడు వెంకటప్రసాద్‌పై దాడి కేసులో పరస్పర ఫిర్యాదులు అందడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు సీతారాంపురం ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. ఒడిశాలో పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో పాతకక్షలను దృష్టిలో ఉంచుకున్న స్థానికులు బంధుగుల ప్రసాద్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు గ్రామ రోడ్డు సెంటర్లో ఉన్న జవాన్‌పై మూకుమ్మడిగా దాడి చేసి గాయపర్చారు.

News January 23, 2026

నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

image

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.

News January 22, 2026

నెల్లూరు: ఆక్వా రైతులకు లైసెన్స్‌ తప్పనిసరి

image

నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుకు కరెంట్ సబ్సిడీ లబ్ధికి అనుమతులు తప్పనిసరి అని మత్స్యశాఖ అధికారిని శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. APSADA & CAA చట్ట నిబంధనల మేరకు ఆక్వా సాగు చేయు (మంచి నీటి & ఉప్పు నీటి వనరులలో) ప్రతి రైతు కరెంటు సబ్సిడీని పొందుటకు తప్పనిసరిగా మత్స్యశాఖ ద్వారా లైసెన్సు పొందాలన్నారు. అనుమతి పొందని వారు ఈనెల 31వ తేదీ లోగా సచివాలయం ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 22, 2026

NLR: న్యూస్ స్ట్రింగర్ల నియామకానికి దరఖాస్తులు

image

నెల్లూరు జిల్లాలో డీడీ న్యూస్ స్ట్రింగర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుదారులు జిల్లాలోనే నివసిస్తూ, అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు రూ.1,180 ప్రాసెసింగ్ ఫీజుతో దరఖాస్తులను విజయవాడలోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి అందించాల్సి ఉంటుంది.