Nellore

News September 26, 2024

పార్వతమ్మకు నివాళులర్పించిన సోమిరెడ్డి

image

ఒంగోలు మాజీ ఎంపీ, కావలి మాజీ శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ భౌతికకాయానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ నివాళులర్పించారు. పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో తెలియదు కానీ మాగుంట సుబ్బరామిరెడ్డి, పార్వతక్క దంపతులను పార్వతీ పరమేశ్వరులుగానే చూశాం. పార్వతక్కను ఎప్పుడు పలకరించినా అక్కను మరిచిపోయావా అని అడిగేవారు. అప్పుడప్పుడూ కనిపించమంటూ ఆప్యాయంగా చెప్పేవారని చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

News September 25, 2024

పోలేరమ్మ జాతర-2024 ఫొటో ఇదే..!

image

వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా అమ్మవారు పుట్టినిల్లు అయిన కుమ్మరి వారి ఇంట అమ్మవారి ప్రతిమ సిద్ధమైంది. మరికాసేపట్లో ఊరేగింపుగా మెట్టినిల్లు అయిన చాకలి వారి ఇంటికి చేరుకోనున్నారు. అక్కడ దిష్టి చుక్క, కనుబొమ్మ పెట్టాక అమ్మవారి గుడి దగ్గరకు తీసుకు వచ్చి ప్రతిష్ఠిస్తారు. తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

News September 25, 2024

నెల్లూరు: గుళికలు మింగి యువకుడి ఆత్మహత్య

image

జీవితంపై విరక్తి పుట్టి గుళికలు మింగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాపూరు మండలంలో చోటుచేసుకుంది. రాపూరు పంచాయతీ పరిధిలోని సైదాదు పల్లి గ్రామానికి చెందిన పానుగోటి పెంచల నరసయ్య(35) బుధవారం గుళికలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా బంధువులు వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం మృతదేహానికి పంచనామా నిర్వహించి బంధువులకు అప్పగించారు.

News September 25, 2024

ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు: ఆనం

image

మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి బుధవారం సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.

News September 25, 2024

కావలి మాజీ MLA మృతి.. నేడు నెల్లూరుకు పార్థివదేహం

image

ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ MLA మాగుంట పార్వతమ్మ చెన్నై అపోలో ఆస్పత్రిలో నేడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పార్థివదేహాన్ని ఉదయం 10 గంటలకు నెల్లూరులోని మాగుంట లేఅవుట్‌కు తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈమె ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వదిన.

News September 25, 2024

నెల్లూరు విజయ డెయిరీ ఎన్నికలు ఏకగ్రీవం

image

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ)కి సంబంధించి జరగాల్సిన మూడు డైరెక్టర్ పోస్టుల ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి హరిబాబు మంగళవారం పేర్కొన్నారు. అన్నం శ్రీహరి (అన్నారెడ్డిపాళెం), కోట చంద్రశేఖర్ రెడ్డి (నారికేళపల్లి), గంగా శ్రీనివాసులు (వాసిలి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. వారి పదవీకాలం ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందన్నారు.

News September 25, 2024

పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష

image

పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిలి యోజన పథకం అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సమీక్షించారు. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు సంబంధిత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు www.pmsuryaghar.gov.in లో రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వ రాయతీ పొందాలన్నారు.

News September 24, 2024

నెల్లూరు: ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.15 లక్షల విరాళం

image

విజయవాడ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల మత్స్యకార సంఘం నాయకులు అన్ని గ్రామాల నుంచి తమ వంతు సహకారంగా విరాళం అందజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి రూ.15 లక్షల చెక్కు రూపంలో ఇచ్చారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు విరాళాలు సేకరించామన్నారు.

News September 24, 2024

ఏపీ మార్కెఫెడ్ డైరెక్టర్‌గా పరసా వెంకటరత్నం

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన రాష్ట్రస్థాయి చైర్మన్ పదవులతో పాటు కొంతమంది డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది. ఏపీ మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌గా తిరుపతి పార్లమెంటు పరిధిలోని సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పేరును ప్రకటించారు. దీంతో ఆయనకు సుళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ, ఇతర టీడీపీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

News September 24, 2024

వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్

image

టీడీపీ ప్రభుత్వం 20 మందికి తొలి విడతలో నామినేటెడ్ పదవులు కేటాయించింది. వీరిలో నెల్లూరు జిల్లా కీలక నేత అబ్దుల్ అజీజ్‌ను వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. కాగా గత ఎన్నికలలో MLA సీటు త్యాగం చేయగా.. తాజా పదవితో ప్రాధాన్యం కల్పించింది. ఈ పదవి అజీజ్ విధేయతకు దక్కిన గౌరవంగా పార్టీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అటు వేణములపాటి అజయ్ కుమార్‌ APTIDCO ఛైర్మన్‌గా నియమితులయ్యారు.