Nellore

News August 30, 2025

కోటంరెడ్డి ఏం చెప్పనున్నారు..?

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరికాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించబోతున్నారు. తనపై రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రధాన అనుచరులు వేసిన మర్డర్ స్కెచ్ గురించి మాట్లాడనున్నారు. అసలు రౌడీషీటర్లు ఆయన్ను ఎందుకు చంపాలనుకున్నారు? హత్య ప్లాన్ ఎవరు చేసి ఉంటారు? అనే దానిపై కోటంరెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

News August 30, 2025

నెల్లూరు జిల్లాలో అసలేం జరుగుతోంది..?

image

రూ.2 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని కోవూరు MLA ప్రశాంతి రెడ్డి ఇంటికి ఓ వ్యక్తి వచ్చి లెటర్ ఇచ్చి వెళ్లాడు. కావలి MLA కృష్ణారెడ్డికి చెందిన క్వారీలో కత్తి వెలుగు చూడటంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. MLA కోటంరెడ్డిని చంపితే డబ్బులే డబ్బులు అంటూ వీడియో వైరలవుతోంది. అలాగే నెల్లూరులో రూ.వెయ్యి, రూ.2వేల కోసమే కొందరు కత్తులతో బెదిరిస్తున్నారు. పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

News August 30, 2025

నెల్లూరు-తడ రోడ్డు విస్తరణకు అమోదం

image

నెల్లూరు-తడ హైవేను ఆరు లైన్లుగా విస్తరించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 110 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరణఖు టెండర్లు పిలుస్తున్నట్లు NHAI ప్రకటించింది. రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ ఇదే అంశంపై రాజ్యసభలో మాట్లాడారు. అలాగే NHAI ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో చర్చించడంతో రోడ్డు విస్తరణకు పచ్చజెండా ఊపారు.

News August 29, 2025

కోటంరెడ్డికి హోం మంత్రి ఫోన్

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హోం మంత్రి అనిత ఫోన్ చేశారు. రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై ఎమ్మెల్యేతో ఆమె మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీడియోలో ఉన్న నిందితులను వెంటనే పట్టుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

News August 29, 2025

పోలీసులపై MLA కోటంరెడ్డి ఆగ్రహం?

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని <<17554192>>హత్య <<>>చేసేందుకు కొందరు మాట్లాడిన వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. హత్య కుట్రకు సంబంధించి పోలీసుల వద్ద సమాచారం ఉన్నా తనకు ఎందుకు చెప్పలేదని వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై తనను ఇకపై కలిసే ప్రయత్నం చేయవద్దని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. హత్య కుట్రపై శనివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడతారని సమాచారం.

News August 29, 2025

గిడుగు ఆలోచనలను అర్థం చేసుకోవాలి: మాజీ ఉపరాష్ట్రపతి

image

భవిష్యత్ తరాలకు మాతృ భాష మాధుర్యాన్ని చేరువ చేసేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్ హాలులో తెలుగు భాష ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. గిడుగు ఆలోచనను సరైన కోణంలో అర్థం చేసుకోవాలని సూచించారు. వాడుక భాష వాడకం పెరగడంతో పాటు, మన ప్రాచీన సాహిత్యాన్ని సైతం అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి అందరూ కృషి చేయాలని కోరారు.

News August 29, 2025

ఒంటరితనంతో మాజీ MP మేనల్లుడి ఆత్మహత్య

image

ఒంటరితనం భరించలేక మాజీ MP P.సుందరయ్య చెల్లెలి కుమారుడు D.చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు బాలాజీ నగర్‌కు చెందిన ఈయన ఈ ప్రైవేట్ కంపెనీలో పని చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. కొద్ది రోజులుగా HYDలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయన అక్కడి నుంచి బయటికి వచ్చి ఖమ్మం(D) మామిళ్లగూడెం వద్ద రైలు కిందపడి చనిపోయారు. డెడ్ బాడీని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

News August 29, 2025

నెల్లూరు: పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చిల్లకూరు(M) తీపనూరుకు చెందిన శ్రీనివాసులు 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేసిన పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు.

News August 29, 2025

ఆ విషయంలో నెల్లూరు జిల్లా టాప్..!

image

లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని DGP హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మిస్సింగ్ కేసులు చేధనలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని నెల్లూరు జిల్లా పోలీసులను అభినందించారు. ప్రజలల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించి, భద్రత, భరోసా, నమ్మకంగా కలిగించేలా విధులు నిర్వహించాలని సూచించారు.

News August 29, 2025

త్వరగా భూసేకరణ చేయండి: నెల్లూరు కలెక్టర్

image

జిల్లాలో అవసరమైన భూసేకరణను త్వరితగతిన చేపట్టాలని సంబంధిత అధికారులను నెల్లూరు కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ల్యాండ్ ఎక్విజిషన్‌పై సంబంధిత అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. నడికుడి- శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వివరాలు తెలుసుకున్నారు. భూమిని ఇచ్చిన వారికి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సూచించారు.