India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో ఆగస్టు 2, 3, 4వ తేదీల్లో 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ హైస్కూల్ గ్రౌండ్ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టర్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.
నెల్లూరు నూతన ఎస్పీగా జి.కృష్ణకాంత్ నియమితులయ్యారు. ఆయన కర్నూలు ఎస్పీగా పని చేస్తూ బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు నెల్లూరు ఎస్పీగా వ్యవహరించిన ఆరిఫ్ హఫీజ్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆయనను సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.
సూళ్లూరుపేటలో శనివారం విషాదం నెలకొంది. కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన ఎర్రబోతు ఇందిరమ్మ, భర్త చెంచురామయ్య శనివారం రైల్వే స్టేషన్ వీధిలోని ఓ ఇంటి వద్దకు బెల్దారి పనికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ఇందిరమ్మ చీర, వెంట్రుకలు మిల్లర్‌లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఆమె మొండెం, తల వేర్వేరు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సీఎం చంద్రబాబును విజయవాడలో శనివారం మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబును వారు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని మేకపాటి అన్నారు.
డక్కిలిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. గురుకుల పాఠశాలలో చదివే ఓ విద్యార్థిని చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గురుకులంలో ఆ విద్యార్థిని అనారోగ్యం గురి కావడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మృతి చెందిందని, ఇందుకు గురుకుల సిబ్బంది కారణమని ఎమ్మార్పీఎస్ నాయకులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
కావలి పరిధిలోని నేషనల్ హైవే రోడ్డుపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్లే రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి భిక్షాటన చేసుకునే వ్యక్తిగా, రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
నాయుడుపేటలో శుక్రవారం రాత్రి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్వర్ణముఖి బ్రిడ్జ్ మీద వెంకటగిరి వైపు నుంచి వస్తున్న ఓ వాహనం ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయి బ్రిడ్జ్ మీద నుంచి కిందకు పడబోయింది. డ్రైవర్ చాకచక్యంతో బ్రిడ్జ్ మీద ఉన్న స్తంభాలను ఢీకొనడంతో ప్రమాదం తప్పింది. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్ ఏర్పడింది.
ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి కేసులో బుచ్చిరెడ్డిపాళెం మండలం రాఘవరెడ్డి కాలనీకి చెందిన గంగపట్నం కుమార్ అనే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. రూ.25 వేల జరిమానా కూడా విధిస్తూ నెల్లూరు 8వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ పనికి వెళ్లే సమయంలో తన కుమార్తెను పక్కింట్లో వదిలి వెళ్లేది. ఈ నేపథ్యంలో 2017 జనవరి 22న కుమార్ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
నెల్లూరులో 17నుంచి ఐదు రోజులపాటు జరిగే బారాషాహీద్ రొట్టెల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. పండుగకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యుల సూచనలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కోవూరు రాళ్లమిట్టలో ఈ నెల 9న యువకుడి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఘటనపై వివరాలను గురువారం డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. బాధితుడు నాగరాజు అతడి స్నేహితులు ఓ పందిని దొంగిలించిన ఘటనలో యజమాని రామకృష్ణతో గొడవడ్డారు. ఈ గొడవలో అనూహ్యంగా మరో స్నేహితుడు నాగరాజును పొడవడంతో అతడు చనిపోయాడు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.
Sorry, no posts matched your criteria.