India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇటీవల పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో భేటీ కావడంతో వారు టీడీపీలో చేరుతున్నారని ప్రచారం మండలంలో జోరు అందుకుంది. దీంతో ఆదివారం బుచ్చిలో ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా వారు టీడీపీలో చేరుతున్నారని మండలంలో చర్చించుకుంటున్నారు. అయితే వారి చేరికతో పలువురు టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 24 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఎస్పీ జీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఆయా స్టేషన్లో విధులు నిర్వహించే హెడ్ కానిస్టేబుల్‌తో పాటు తిరుపతి జిల్లాకు చెందిన పి.కృష్ణ, పి.చంద్రయ్య, షేక్ ఖాదర్ మస్తాన్, షేక్ అహ్మద్ బాషా, సి.వెంకటేశ్వరరావు జాబితాలో ఉన్నారు.
అప్పులపాలైన ఓ యువకుడు ఇంట్లో నుంచి అదృశ్యమైన ఘటనపై నెల్లూరు నవాబుపేట శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటేశ్వరపురంలో పుష్పాంజలి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె కుమారుడు అభినాశ్ బీటెక్ చేశాడు. ఇంటి వద్దనే ఉంటూ స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి నష్టపోయాడు. దీంతో అప్పులపాలయ్యాడు. నగదు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు అధికమవడంతో ఈనెల 18వ తేదీన ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు.
కలెక్టర్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో అధికారులంతా చురుగ్గా పాల్గొని, 100 రోజుల ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ సూర్యతేజ తెలియజేసారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంల్లో 26వ తేదీ వరకు ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు.
నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి(విజయ డెయిరీ) ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23న నామినేషన్ల స్వీకరణ, అదే రోజున పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ గడువు. 28న ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కిస్తారు.
ఓ మేనేజర్ రూ.2.16 కోట్లు స్వాహా చేసిన ఘటన నాయుడుపేట మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పండ్లూరు వద్ద వెయిట్ లెస్ బ్రిక్స్ పరిశ్రమలో మేనేజర్‌గా కాట్రగడ్డ సురేశ్ పనిచేస్తున్నారు. రెండేళ్లుగా నకిలీ బిల్లులు సృష్టించారు. ఇలా దాదాపు రూ.2.16 కోట్లు స్వాహా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మేనేజర్‌తో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిపై నాయుడుపేట సీఐ బాబి చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు. నాగరాజు వెంకటగిరిలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో గురువారం చనిపోయారని ఆయన కుటుంబీకులు తెలిపారు. వెంకటగిరి సీఐ ఏవీ రమణ, ఎస్ఐ సుబ్బారావు మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 26వ తేదీ వరకు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 20న చేజర్ల మండలం మాముడూరు, 21 సంగం మండలం జండాదిబ్బ, 22న ఏఎస్పేట హస్నాపురం, 23న ఆత్మకూరు మున్సిపాలిటీ పేరారెడ్డిపల్లి, 24న అనంతసాగరం, లింగంగుంట, 25న మర్రిపాడు, తిక్కవరం, 26న ఆత్మకూరు, చెర్లో ఎడవల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు.
స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో జిల్లాలోని వృద్ధి కారకాలను (గ్రోత్ ఇంజన్లను) గుర్తించి విజన్ యాక్షన్ ప్లాన్-2047ను అక్టోబర్ 15 లోపు తయారు చేయాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. స్వర్ణాoద్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ తయారీపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను పరిశ్రమల శాఖ జీఎం సుధాకర్ కమిటీ సభ్యులకు వివరించారు.
Sorry, no posts matched your criteria.