Nellore

News June 22, 2024

నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సంతకం ఫోర్జరీకి గురైంది. ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులు బి.ప్రవీణ్, ఎం.దేవేంద్ర, సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులు పి.నాగేంద్ర బాబు, కార్తీక్ మాలవ్యను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆరోపణపై షోకాష్ నోటీసులు జారీ చేసినా..వివరణ సరిపోలలేదని కమిషనర్ తెలిపారు. వీరితో పాటు ఎల్‌టీపీ దిలీప్ కుమార్‌కు నోటీసులు ఇచ్చారు. వివరణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.

News June 22, 2024

ఎవరూ అధైర్య పడొద్దు: MLCతో జగన్

image

అసెంబ్లీ ఛాంబర్‌లో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తినీ ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఓడిపోయినందుకు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని కోరినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పార్టీకి అన్నివేళలా అందుబాటులో ఉంటామన్నారు.

News June 21, 2024

నెల్లూరు: ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరు, రంగాచార్యుల కండ్రిగ మధ్యలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ముత్తుకూరుకి వెళ్తున్న ఆటోని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటోలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

News June 21, 2024

నెల్లూరు జిల్లా వాసికి కెనడాలో అరుదైన గౌరవం

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన వేమన వెంకట సురేశ్‌కు కెనడాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడ ప్రఖ్యాత ఆల్‌బెర్టా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ రిప్రజెంటేటివ్‌గా కెనడా ప్రభుత్వం ఆయనను నియమించింది. ప్రస్తుతం ఆయన కెనడాలో టెక్నికల్ హైస్పీడ్ రైల్వే ప్రాక్టీస్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి వరకు చుంచులూరు ప్రభుత్వ స్కూల్లోనే సురేశ్ చదివారు.

News June 21, 2024

ఉదయగిరిలో జగన్ ఫోటోల తొలగింపు

image

నెల్లూరు జిల్లా ఉదయగిరి సచివాలయంపై ప్రభుత్వ మారినా జగన్ ఫొటోలు <<13479984>>తొలగించలేదని <<>>ఇవాళ ఉదయం Way2Newsలో వార్త ప్రచురితమైంది. వెంటనే అధికారులు స్పందించారు. సచివాలయం భవనంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్, నవరత్నాల లోగోలను అధికారులు తొలగించారు.

News June 21, 2024

ముందు నారాయణ.. తర్వాత ఆనం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో టీడీపీ గెలిచిన విషయం తెలిసిందే. వీరిలో ముందుగా మంత్రి నారాయణ ఇవాళ అసెంబ్లీలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆత్మకూరు నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతోంది. మరికాసేపట్లో ఇతర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది.

News June 21, 2024

నెల్లూరు: ఇంకా తొలగని జగన్ ఫొటోలు

image

ప్రభుత్వం మారడంతో అన్ని చోట్లా మాజీ సీఎం జగన్, మాజీ మంత్రుల ఫొటోలను అధికారులు తొలగించారు. ఎక్కడికక్కడ కొత్త సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మాత్రం జగన్ ఫొటోలు ఇంకా దర్శనమిస్తున్నాయి. స్థానికంగా ఉన్న బిట్-1, 3 సచివాలయ భవనంపై సీఎం జగన్ అంటూ ఆయన ఫొటో, నవరత్నాల లోగో ఇంకా అలాగే ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

News June 21, 2024

విక్రమ సింహపురికి అదనపు కోచ్‌ల ఏర్పాటు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విక్రమ సింహపురి అమరావతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కు మూడు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశామని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ-గూడూరు(12744) రైలుకు ఈనెల 20 నుంచి 30 వరకు.. గూడూరు-విజయవాడ(12743) రైలుకు ఈనెల 21 నుంచి జులై ఒకటి వరకు అదనపు కోచ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇవి సెకండ్ సిట్టింగ్‌కు సంబంధించినవి.

News June 21, 2024

నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవాలి: బీజేపీ

image

నెల్లూరు నగరంలోని బర్మా షేల్ గుంటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదం ఘటన హృదయ విధారకమైందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి అన్నారు. ప్రభుత్వం తోపాటు స్వచ్చంద సంస్థలు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 14ఇళ్ళు అగ్నికి అహుతి అయ్యాయని ఆ ఇండ్లలో ఉన్న సామానులు బట్టలు పూర్తిగా కాలిపోవడంతో వారు నిరాశ్రయులు అయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

News June 20, 2024

నెల్లూరు: బీద రవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీ!

image

కావలికి చెందిన బీద రవిచంద్ర యాదవ్‌ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈ క్రమంలో బీదరవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.