Nellore

News April 20, 2024

ఆక్రమ రవాణాపై ఉక్కు పాదం జిల్లా ఎస్పీ ఆరీఫ్

image

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం జిల్లాలో సైదాపురం పరిధిలో-20, KP పోర్ట్-9, కొండాపురం-15, సంగం-11, దుత్తలూరు-7, జలదంకి-25, చేజెర్ల-10 మరియు SEB-217 మద్యం బాటిల్స్ లను సీజ్ చేసామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే సి-విజిల్ యాప్ , టోల్ ఫ్రీ నంబర్ డయల్ 112 ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 20, 2024

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో RTC ఉద్యోగి అక్కడికక్కడే మృతి

image

బైకును లారీ ఢీకొని మహిళ అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్‌టీసీ ఉద్యోగి మునికుమారి(45), భర్త హరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మునికుమారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త హరికి గాయాలయ్యాయి.

News April 20, 2024

‘గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాం’

image

అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ గూడూరులోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లడం ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ తెలపడంతో ఆయన ఈ హామీ ఇచ్చారు.

News April 20, 2024

వెంకటాచలం : 22న కాకాణి నామినేషన్

image

సర్వేపల్లి వైసీపీ అభ్యర్థిగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏప్రిల్ 22న నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వెంకటాచలం మండల పరిషత్ కార్యాలయంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారని కాకాణి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.

News April 20, 2024

ఆత్మకూరు : 22న ఆనం నామినేషన్

image

ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి ఏప్రిల్ 22వ తేదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ఆత్మకూరు సత్రం సెంటరు నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ స్టేషన్, మీదుగా మున్సిపల్ ఆఫీసుకు చేరుకుంటారని ఆనం కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

News April 20, 2024

నెల్లూరు MP అభ్యర్థి ఆస్తి రూ.11.55 కోట్లేనంట..!

image

➤నియోజకవర్గం : నెల్లూరు పార్లమెంటు
➤అభ్యర్థి : కొప్పుల రాజు (కాంగ్రెస్ పార్టీ)
➤విద్యార్హత : ఎంఫిల్
➤వృత్తి : విశ్రాంత ఐఏఎస్ అధికారి
➤కుటుంబ ఆస్తి: 11.55 కోట్లు
➤అప్పులు: రూ.1.02 కోట్లు
నోట్ : ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఈ వివరాలు నమోదు అయ్యాయి.

News April 20, 2024

నెల్లూరు: మహిళ స్పాట్‌డెడ్

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద బైకును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

కోటంరెడ్డి ఆస్తులు రూ.2.45 కోట్లు

image

➤ నియోజకవర్గం: నెల్లూరు రూరల్
➤ అభ్యర్థి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(టీడీపీ)
➤ విద్యార్హత: డిగ్రీ డిస్ కంటిన్యూ
➤ ఆస్తుల విలువ: రూ.1.20 కోట్లు
➤ కుటుంబ ఆస్తి: రూ.2.45 కోట్లు
➤ అప్పులు: రూ.16.90 లక్షలు
➤ వృత్తి : రియల్ ఎస్టేట్
➤ వాహనాలు: 2 (ఫార్చూనర్, ఇన్నోవా)
➤ కేసులు: 4 (ఒకటి బెట్టింగ్ కేసు)
NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం .

News April 20, 2024

రెండవ రోజు 8 నామినేషన్లు : నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో రెండో రోజు 8 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. జిల్లాలో 8 స్థానాలకు 14 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కొప్పుల రాజు నామినేషన్ సమర్పించారన్నారు. కోవూరు, నెల్లూరు సిటీ, సర్వేపల్లి, ఉదయగిరి నుంచి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదన్నారు.

News April 19, 2024

అక్రమ రవాణాపై ఉక్కు పాదం: నెల్లూరు ఎస్పీ

image

ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాహన తనిఖీల్లో భాగంగా కావలి వన్ టౌన్ పరిధిలో రూ.4లక్షలు, బాలాజీ నగర్‌లో 2లక్షల 13 వేల నగదుతో పాటు 655 టీ కప్ సెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేపీ పోర్ట్ పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.