Nellore

News April 14, 2024

NLR: బస్సులో మహిళ మృతి

image

ఓ‌ మహిళ ఆర్టీసీ బస్సులోనే చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం‌ ఆదూరుపల్లి వద్ద ఆదివారం వెలుగు చూసింది. నెల్లూరు నుంచి కలువాయికి వెళ్తున్న బస్సులో ఓ‌ మహిళ అస్వస్థతకు గురైంది. ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2024

NLR: వలస ఓటర్లపై నేతల ఫోకస్

image

నెల్లూరు జిల్లాకు చెందిన వేలాది మంది ఓటర్లు పొరుగు రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం ఉన్నారు. ఒక్క ఉదయగిరికి సంబంధించే సుమారు 35 వేల మంది ఓటర్లు హైదరాబాద్, నల్గొండ, పూనే, ముంబయి, బెంగళూరు, చెన్నైలో ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలో వలస ఓటర్లపై అన్నిపార్టీల నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీడీపీ నేతలు ఇప్పటికే హైదరాబాద్ మియాపూర్, బీఎన్ రెడ్డి నగర్లలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తమకు మద్దతు పలకాలని కోరారు.

News April 14, 2024

కోవూరులో 30 మంది వాలంటీర్లు రాజీనామా

image

కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకచర్ల పంచాయతీ పరిధిలోని13 మంది వాలంటీర్లు, కోవూరు మండలం పాటూరు పంచాయతీకి సంబంధించిన 17 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతు పలికి వైసీపీలో చేరారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి రాజేంద్రరెడ్డి, నిరంజన్ బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2024

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం : కలెక్టర్

image

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం నెల్లూరు విఆర్సి సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి అంబేద్కర్ ఒక దిక్సూచి నిలిచిపోయారని కొనియాడారు. సోషల్ వెల్ఫేర్ డిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2024

నెల్లూరు: వాట్సాప్‌లో విద్యుత్ సేవలు

image

వాట్సాప్ నంబరు ద్వారా విద్యుత్ శాఖకు సంబంధించిన పలు సేవలు పొందవచ్చని ఎస్పీడీసీఎల్ నెల్లూరు ఎస్ఈ విజయన్ తెలిపారు. 91333 31912 నంబరుతో వాట్సాప్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. వినియోగదారుడు తమ 13 అంకెల సర్వీస్ నంబర్ ను వాట్సాప్ లో పంపితే అందుబాటులో ఉన్న సేవల ఆఫ్షన్లు వస్తాయన్నారు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించుకోవచ్చన్నారు.

News April 14, 2024

నెల్లూరు: 61 మందికి 9 మందే పాస్

image

పొదలకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఈ ఏడాది 61 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాశారు. వారిలో కేవలం 9 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 56 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 28 మంది పాస్ అయ్యారు. కళాశాలలో అన్నీ వసతులున్నా చాలా తక్కువ మంది ఉత్తీర్ణులు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News April 14, 2024

నెల్లూరు: సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడిన మెరైన్ పోలీస్

image

సైదాపురం మండలం తూర్పుపూండ్లకు చెందిన హుస్సేన్ బాషా స్నేహితులతో కలిసి శనివారం కోడూరు బీచ్ కు వచ్చాడు. సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో అలల తాకిడికి లోనికి వెళ్లిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన మెరైన్ కానిస్టేబుల్ పోలయ్య వెంటనే అప్రమత్తమై ఆ యువకుడిని బయటకు తీసుకొచ్చాడు. సీపీఆర్ చేసిన అనంతరం చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సకాలంలో స్పందించిన పోలయ్యను పలువురు అభినందించారు.

News April 14, 2024

ఆత్మకూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు

image

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంజాన్ పండగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న విక్రమ్ రెడ్డి ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని ఎంసీసీ నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆత్మకూరు ఎస్సై ముత్యాలరావు తెలిపారు.

News April 13, 2024

నెల్లూరు: రూ.లక్ష తర్వాత మద్యం షాపులు మూసివేయాలి

image

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషన్ మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించింది. మద్యం దుకాణాల్లో రూ.లక్ష విలువగల మద్యం విక్రయం జరగగానే షాపులను మూసివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ప్రతి వ్యక్తికి ఒక్క మద్యం క్వార్టర్ బాటిళ్లు మాత్రమే అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. గతంలో ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లు ఇచ్చే వెసులుబాటు ఉండింది. ప్రస్తుతం ఒక్క బాటిల్‌కు మాత్రమే కుదించింది.

News April 13, 2024

ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించిన కలెక్టర్

image

కందుకూరు నియోజకవర్గం జాతీయ రహదారి తేట్టు వద్ద స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్‌పోస్ట్‌ను కలెక్టర్ ఎం హరి నారాయణన్ పరిశీలించారు. కందుకూరు నియోజక వర్గంలోని టి.ఆర్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో పిఓలకు , ఏపిఓలకు నిర్వహిస్తున్న ఎన్నికల శిక్షణ తరగతులు పరిశీలించారు. అనంతరం కావలి నియోజకవర్గం జాతీయ రహదారి రుద్రకోట స్టాటికల్ సర్వేలెన్స్ టీం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.