India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై నెల్లూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేతలుగా గుర్తింపు పొందగా.. పొంగూరు నారాయణ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మహిళా కోటలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు వినిపిస్తోంది. కాగా ముగ్గురికి మంత్రి పదవులు రావొచ్చని తెలుస్తోంది.
ఈనెల 12న విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సులు చొప్పున 32 బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు 17 ఎల్ఈడి స్క్రీన్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలువాయి మండలానికి చెందిన డిస్కం ఏఈ యశ్వంత్(26) మృతి చెందాడు. స్థానికులు వివరాల ప్రకారం.. యశ్వంత్ రెండు రోజుల క్రితం బెంగళూరు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇతని కుటుంబ సభ్యులు నెల్లూరులో నివాసముంటున్నారు.
బోగోలు మండలం బిట్రగుంటలో టపాసుల గోడౌన్లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అందులో ఉన్న బాలుడు సురేశ్ రైనా(13) ప్రాణాలు కోల్పోగా.. గౌడౌన్ యజమాని సుమంత్‌తో పాటు మరొకరికి గాయాలయ్యాయి. బాలుడు కప్పరాళ్ల తిప్ప గ్రామానికి చెందినవాడు. గోదాములో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బాలుడికి, గోదాము యజమానికి గాయాలు కాగా, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు విద్యుత్ కాంతులతో దర్శనమిస్తున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులు పాటు అన్ని కార్యాలయాల ఎదుట విద్యుత్ కాంతులతో ఉండాలని సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయా కార్యాలయంల వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
విజయవాడ సమీపంలోని గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈనెల 12న జరగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రజలు వీక్షించేందుకు 17 ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టరు వికాస్ మర్మత్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.
సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో ఉండవల్లి నివాసంలో భేటీ అయ్యారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న సోమిరెడ్డి చంద్రబాబుని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పెళ్ళకూరు మండలం పాల్చూరు గ్రామంలో విషాదం చోటు చేసకుంది. విద్యుత్ తీగలు మరమ్మతులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం మీద నుంచి జారిపడి ఆనందయ్య అనే కాంట్రాక్ట్ కార్మికుడు (55) మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరులో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. సోమవారం నెల్లూరు మేయర్ శ్రవంతి జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. నాలుగు నెలల క్రితం టీడీపీలో చేరిన మేయర్ దంపతులు మూడు రోజులు తిరిగేసరికి మళ్లీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆమె పార్టీకి రాజీనామా చేశారు.
మామిడికాయల లోడుతో తిమ్మసముద్రం నుంచి వస్తున్న లారీ సోమవారం జమ్మలపాలెం వద్ద అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. తిమ్మసముద్రం నుంచి లోడుతో హైదరాబాద్ వెళుతున్న లారీ జలదంకి మండలం జమ్మలపాలెం గ్రామం వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో లారీలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ఉండగా.. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Sorry, no posts matched your criteria.