Nellore

News April 12, 2024

నెల్లూరు: రూ.5.28 లక్షల మద్యం సీజ్

image

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు రూ.5,28,168 విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశామన్నారు. పొరుగు మద్యం విక్రయాలపై 3 కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనధికార విక్రయాలపై 191 కేసులు నమోదు చేసి 194 మందిని అరెస్ట్ చేశారు.

News April 12, 2024

నెల్లూరు జిల్లాలో కోవర్టు రాజకీయాలు..!

image

నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో జిల్లాలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ పెరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలు జోరుగా జరుగుతున్నాయి. కొందరు కోవర్టులుగా పని చేస్తూ సొంత పార్టీకి నష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి వెంట తమ కోవర్టులు ఉన్నారని వైసీపీ కోవూరు MLA అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడే స్వయంగా చెప్పడం ఇందుకు నిదర్శనం.

News April 12, 2024

NLR: ఫలితాల కోసం 52,076 మంది వెయిటింగ్

image

ఇంటర్ పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆస్ఐఓ డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 26,419 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 25,657 మంది హాజరయ్యారు. మొత్తంగా 52,076 మంది ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.

News April 12, 2024

నెల్లూరు: ఇల్లు దగ్ధం

image

వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్ సమీపంలో జెండా వీధిలో ఉంటున్న ఆర్టీసీ ఉద్యోగి షేక్ నసురుద్దీన్ ఇల్లు గురువారం పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.6 లక్షల నష్టం జరిగిందని బాధితుడు నసురుద్దీన్ వాపోయాడు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఎలక్ట్రికల్ పరికరాలు, బంగారం, నగదు, ఖరీదైన దుస్తులు, వస్తువులు బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

News April 11, 2024

NLR: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రంజాన్ రోజున రోజు తీవ్ర విషాదం నెలకొంది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన SK ఉమర్ బీటెక్ చదువుతున్నాడు. ఇవాళ చికెన్ దుకాణంలో పనికి వెళ్లాడు. ఈక్రమంలో అతనికి కరెంట్ షాక్ తగలడంతో చనిపోయాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

నెల్లూరు: మద్యం దుకాణాలపై ఆంక్షలు..?

image

ఆంక్షలతో నెల్లూరు జిల్లాలో కొన్నిచోట్ల సాయంత్రానికే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 271 షాపులు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ఒకరోజులో ఎంత మొత్తం మద్యం విక్రయించారో.. ప్రస్తుతం కూడా రోజుకు అంతే విక్రయించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఉదయం 11 గంటలకు తెరుచుకుంటున్న షాపుల్లో సాయంత్రానికే టార్గెట్ పూర్తి కావడంతో మూతపడుతున్నాయి. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

News April 11, 2024

నెల్లూరు: జనసేనలో కీలక నేతగా ఎదిగినా..

image

చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి నెల్లూరు రూరల్ మండలం కలివెలపాళేనికి చెందిన వారు. NRI అయిన ఆయన జనసేన ఆవిర్భావంలోనే పార్టీలో చేరారు. కీలక విభాగమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిన మనుక్రాంత్ ఈ ఎన్నికల్లో సిటీ సీటు ఆశించారు. కీలకనేతగా ఉన్నా కేడర్ తో కనెక్ట్ కాలేకపోయారని విమర్శలు ఉన్నాయి.

News April 11, 2024

టీడీపీలో చేరిన మేకపాటి మేనల్లుడు

image

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు బిజవేముల సురేంద్ర నాధ్ రెడ్డి గురువారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరులోని ఆనం నివాసంలో ఆత్మకూరు టీడీపీ MLA అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఆయనతో పాటు మర్రిపాడు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు.

News April 11, 2024

నెల్లూరు: రూ. 16.90 లక్షల నగదు స్వాధీనం

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16.90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాంతో పాటు అక్రమంగా తరలిస్తున్న 164 మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

News April 11, 2024

జూన్ 14 వరకు చేపల వేట నిషేదం 

image

బంగాళాఖాతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేటను నిషేధించినట్లు కోట ప్రాంత మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రెడ్డి నాయక్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టే సమయంలో మరబోట్లతో వేట నిషేధించామని వెల్లడించారు. ఉల్లంఘించిన వారి మరబోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు డీజిల్, ఇతర రాయితీలను రద్దు చేస్తామని హెచ్చరించారు.