India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరు ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట హైవేలపై ప్రయాణించే బస్సులు, లారీ డ్రైవర్లను నిలుపుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వారి నిద్రమత్తు వదిలించేందుకు ముఖం కడిగిస్తున్నారు.

జగన్‌ను కలిసే విషయయై YCP రాజ్యసభ MP అయోధ్య రామిరెడ్డితో నెల్లూరు MP వేమిరెడ్డి చర్చించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘మాకు కావాల్సింది గౌరవం. TDP ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఉన్నాం. ఇదే పార్టీలోనే కొనసాగుతాం. రాజధానిపై YCPకి స్పష్టతలేదు. మావిగన్ అంటే జనాలు నవ్వుతున్నారు. తమిళనాడు బోట్లను అడ్డుకోవడానికి త్వరలో నెల్లూరుకు 2, తిరుపతి, బాపట్లకు ఒక్కోటి చొప్పున బోట్లు ఇస్తాం’ అని వేమిరెడ్డి చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తన తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని MLA శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. మహిళకు రిజర్వ్ అయితే తన కుమార్తె లక్ష్మీహైందవి, వైష్ణవి, గిరిధర్ కుమార్తె సాయి శశిర రెడ్డిలో ఒకరికి టికెట్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారంట. గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మంత్రులు ఆనం, నారాయణ కుమార్తెలు కైవల్య, షరిణి, సోమిరెడ్డి కోడలు శ్రుతిరెడ్డి సైతం బరిలో ఉంటారని ఉహాగానాలు మొదలయ్యాయి.

నెల్లూరు జిల్లాలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ ఫేజ్-3కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎంపికైన వారికి రూ.9వేలు, స్టైపెండ్, రూ.6వేలు గ్రాంట్, ఇంటర్న్‌షిప్ పూర్తయ్యాక సర్టిఫికెట్ అందజేస్తారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివి వయసు 18-25 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు అర్హులు. ఏప్రిల్ 15వ తేదీ లోపు pminternship.mygov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో నెల్లూరు జిల్లా యువకుడు చనిపోయాడు. కావలికి చెందిన పసుపులేటి పెంచాల దేశిత్(25) HYDలోని హఫీజ్‌పేట్ వద్ద ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫ్రెండ్‌తో కలిసి బైకుపై శనివారం అల్విన్ కాలనీ వైపు బయల్దేరాడు. బైకును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దేశిత్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. అతని ఫ్రెండ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఉదయగిరి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ముగ్గురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనతో సిబ్బంది వారిని కళాశాల అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెస్‌లో ఫుడ్ పాయిజన్ కావడం వల్లే విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల పేరెంట్స్ ఫిర్యాదు చేయడంతో శనివారం ఉన్నతాధికారులు కళాశాలలో విచారణ చేపట్టారు.

మహిళల రక్షణే ధ్యేయంగా నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ‘శక్తి’ యాప్‌పై శనివారం విస్తృత అవగాహన కల్పించింది. SP అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఆపద సమయంలో ఈ యాప్ మహిళలకు ఎలా రక్షణ కవచంలా నిలుస్తుందో వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను ప్రతి మహిళా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.

తిరుమలలో తొండమాన్ చక్రవర్తి శ్రీవారికి బంగారు పుష్పాలతో అర్చనలు చేస్తూ తనకన్నా గొప్ప భక్తుడు లేడని గర్వించేవాడు. ఒకరోజు శ్రీవారి పాదాల చెంత మట్టిపూలు కనిపించాయి. ఆశ్చర్యపోయిన రాజుకు స్వామివారే కుమ్మరి <<19559783>>దాసుడి<<>> భక్తిని వివరించారు. పేదవాడైన అతను భక్తితో మట్టిపూలు సమర్పించేవాడు. నిజమైన భక్తి సంపదలో కాదు, మనసులో ఉందని గ్రహించిన తొండమాన్ వినమ్రుడయ్యాడు. అహంకారాన్ని వీడి భక్తితో స్వామివారి సేవ చేయడం ప్రారంభించాడు.

Sorry, no posts matched your criteria.