India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పని ప్రదేశాలలో మహిళలపై అఘాయిత్యాలకు, లైంగిక వేధింపులకు గురిచేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. మంగళవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని తిక్కన భవన్‌లో ICDS వారు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో ధరలు భారీగా పెరిగాయి. గత శుక్రవారం బస్తా రూ.10 వేలు ఉండగా.. నేడు నాణ్యతను బట్టి రూ.11వేల నుంచి రూ.12 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, కోతకు కూలీల కొరత ఏర్పడింది. గూడూరులోనూ ధరలు పెరిగాయి.

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను HMలు గుర్తించి విద్యాంజలి పోర్టల్లో ఈనెల 15వ తేదీలోగా అప్‌లోడ్ చేయాలని DEO బాలాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య కోరారు. దాతలు నేరుగా ఈ పోర్టల్ ద్వారా పాఠశాలలను ఎంచుకుని సహకారం అందించవచ్చన్నారు. పోర్టల్ ద్వారా నగదు రూపంలో విరాళాలు సేకరించరని చెప్పారు. వస్తువులు, సేవల రూపంలోనే సహకారం అందించాలని కోరారు.

నెల్లూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు నేటితో గడువు ముగియనున్నట్లు జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. నెల్లూరు, తుమ్మలపెంట, గండిపాలెం, చిలమానుచేను, ఆత్మకూరులో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారని చెప్పారు.

టీపీ గూడూరులో 60 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కన్నకూతురు, కుటుంబ సభ్యులు శారీరక, మానసిక వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. బాధితురాలు కన్నీటితో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముసలితనంలో అండగా ఉండాల్సిన వారే ఇలా రోడ్డుపైకి నెట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది.

నెల్లూరు జిల్లాలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై మరో అడుగు ముందుకు పడింది. విమానాశ్రయ పనుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.50కోట్ల మంజూరుకు సోమవారం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిధులతో ఎయిర్‌పోర్ట్ భూముల్లో కరెంట్ వైర్ల తొలగింపు, కాలువల దారి మళ్లింపు, రోడ్డు పనులు చేస్తారు. అలాగే హడ్కో రుణం తీసుకోవడానికి సైతం పర్మిషన్ ఇచ్చింది. మొత్తంగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రూ.900కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఓ బాలిక రాపూరులో 10వ తరగతి చదివేది. 2021 అక్టోబర్ 10న బాలిక ఆటో దిగి స్కూల్‌కు వెళ్తుండగా డక్కిలి(M) దేవులపల్లికి చెందిన చాట్ల శ్రీనివాసులు ఆమెను ఆపాడు. ‘మీ అమ్మకు బాగోలేదు. వెంకటగిరి ఆసుపత్రిలో ఉంది’ అని ఆమెను బైకుపై ఎక్కించుకున్నాడు. పంగిలి వద్ద బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తిరిగి రాపూరులో వదిలేశారు. నేరం రుజువు కావడంతో యువకుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువడింది.

నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల వినూత్నంగా డ్రోన్ నిఘా వ్యవస్థను అమలులోకి తెచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని ముఖ్య కూడళ్లు, శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్ల సహాయంతో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేశారు. సంబంధిత డీఎస్పీల పర్యవేక్షణలో CI, SIలు క్షేత్రస్థాయిలో ఈ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.

Sorry, no posts matched your criteria.