Nellore

News March 10, 2025

రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

image

ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.

News March 10, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు సమస్యలపై ప్రజలు అందిస్తున్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 309 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌, తదితరులు ఉన్నారు.

News March 10, 2025

పోలీస్ గ్రీవెన్స్‌కి 73 ఫిర్యాదులు: ఎస్పీ

image

నెల్లూరు ఉమేశ్ చంద్ర కాన్ఫ‌రెన్స్ హాల్‌లో సోమ‌వారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మాన్ని జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ నిర్వ‌హించారు.  బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీక‌రించి వారితో స్వ‌యంగా మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రీవెన్స్ కి మొత్తం 73 ఫిర్యాదులు అందాయ‌ని ఎస్పీ చెప్పారు. ప్ర‌తీ అర్జీని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

News March 10, 2025

మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన బీద రవిచంద్ర

image

శాసనసభ్యుల కోటా నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన ఆ పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా మంత్రి లోకేశ్‌ను కలిశారు. ప్రజాసమస్యలను మండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా రవిచంద్రకు లోకేశ్ అభినందనలు తెలిపారు.  

News March 10, 2025

కందుకూరు ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు?

image

కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో జోక్యం చేసుకుంటున్న ఆయన వాటా కోసం డిమాండ్ చేసినట్లు ఆంధ్రజ్యోతి సంచలన <>కథనం<<>> ప్రచురించింది. దీనికి ఆ సంస్థ ససేమేరా అనడంతో పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్తున్న లారీలను అడ్డుకుంటున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారం సీఎంవోకు చేరడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

News March 10, 2025

‘బీద’ ఫ్యామిలీ ‘డబుల్’ ఆఫర్

image

నెల్లూరు జిల్లాలో ‘బీద’ కుటుంబానికి MLC పదవి వరించింది. టీడీపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌కు బీసీ కేటగిరిలో సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పటికే ఆ కుటుంబంలోని బీద మస్తాన్ రావు వైసీపీ నుంచి టీడీపీలోకి రాగానే రాజ్యసభ సీటు ఇవ్వగా, ఆయన సోదరుడు బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

News March 10, 2025

నెల్లూరు: పెళ్లి మండపంలో క్రికెట్ మ్యాచ్ లైవ్

image

పెళ్లి వేడుకల్లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామలింగాపురంలోని ఓ కళ్యాణ మండపంలో వధూవరులు వినూత్నంగా అతిథుల కోసం ఇండియా న్యూజీలాండ్ క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు పెళ్లి వేడుకల్లోనే మ్యాచ్‌ను వీక్షించారు. వధూవరులు క్రికెట్‌పై తమ ప్రేమను ఇలా చాటుకున్నారని పలువురు ప్రశంసించారు.

News March 10, 2025

పొదలకూరు నిమ్మ యార్డుకు మంగళవారం సెలవు

image

హోలీ పర్వదినం సందర్భంగా పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ యార్డుకు మంగళవారం సెలవును ప్రకటిస్తూ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వ్యాపార లావాదేవీలకు సుముఖత చూపించరన్నారు. ఇందుకోసం యార్డ్‌కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని యార్డ్ పరిధిలోని పరిసర ప్రాంతాల నిమ్మ రైతులు గమనించాలని కోరారు.

News March 9, 2025

నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్ర పేరును టీడీపీ ఖరారు చేసింది. ఈయన కావలి నియోజకవర్గం అల్లూరు(M) ఇస్కపల్లిలో జన్మించారు. గతంలో ఆయన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, ఆక్వా అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈయన సోదరుడు బీద మస్తాన్‌‌రావు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

News March 9, 2025

నెల్లూరులో నేడు పవర్ కట్

image

నెల్లూరులోని పలు ప్రాంతాలలో మరికాసేపట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల నేపథ్యంలో పినాకినీ అవెన్యూ, ఆకుతోట హరిజనవాడ, సర్వేపల్లి కాలువకట్ట, చిల్డ్రన్ పార్క్, అయోధ్యా నగర్, మధురా నగర్, అపోలో ఆస్పత్రి ప్రాంతాలలో ఉదయం 8 నుంచి మ.1గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

error: Content is protected !!