India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి అల్లిపురం గిరిజన కాలనీకి చెందిన నాగేంద్రమ్మ(11), చింతాలయ్య(11) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సత్యవేడు మండలం ఆరూరులో మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన స్టాలిన్ అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేసినట్లు శ్రీసిటీ డిఎస్పీ పైడేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్వ్యూకు వెళుతున్న ఓ మహిళను ద్విచక్ర వాహనంలో ఎక్కించుకొని అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.
నెల్లూరు నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు నగరంలోని వేదయపాలెం, జ్యోతి నగర్, రామ్మూర్తి నగర్, నిపోసెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్ మొదలైన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు, కాలువలు వర్షపు నీటితో నిండిపోయాయి. రోడ్లపై ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జీఎన్ఎం -బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్కే. అబ్దుల్ ఖయ్యూం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు. వీరికి జర్మన్ భాష నేర్పించడంతో పాటు తిరుపతిలోని స్విమ్స్ నర్సింగ్ కాలేజీలో 6నెలల పాటు శిక్షణ ఉంటుందన్నారు.
ఉదయగిరి మండలంలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న 11మంది సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు ఎంపీడీవో అప్పాజీ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. షోకాజు నోటీసులు అందుకున్న వారిలో ఎనర్జీ, వెటర్నరీ, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళ పోలీసు, వీఆర్ఓ, ఏఎన్ఎంలు ఉన్నారని, వీరంతా మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా కోట ప్రధాన రహదారి మారింది. గుంతలమయంగా మారినా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోట క్రాస్ రోడ్డు వరకు గుంతలమయంగా మారింది. దానికి తోడు వర్షాలు కురవడంతో బురదమయంగా మారి వాహనదారులతోపాటు పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు.
నెల్లూరు జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్‌లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.
Sorry, no posts matched your criteria.