India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్-2025 అమలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌లో అమలు చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మాలకొండయ్య పాల్గొన్నారు.
జిల్లాలోని వ్యవసాయ, పాడి, మత్స్య సహకార సంఘాలను పటిష్టపరిచి, సభ్యులకు మరింత మెరుగైన సేవలందించాల్సిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సహకార రంగం ద్వారా ఇప్పటివరకు సాధించిన అభివృద్ధిని జిల్లా సహకార శాఖ అధికారి గురప్ప వివరించారు.
జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ AE మధుసూదన్‌రావును సస్పెండ్ చేస్తూ ఆ శాఖ MD రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో HCలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిమెంట్, స్టీల్, ఇసుకను అమ్ముకున్నట్లు విజిలెన్స్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గతంలో HC ఇన్‌ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజు, EE దయాకర్, AEలు జమీర్, వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేశారు.
నెల్లూరుకు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు మ్యాట్రీమోని ద్వారా పెళ్లి సంబంధాలు చూస్తుండగా.. విజయవాడకు చెందిన అమీర్‌ఖాన్ పరిచయమయ్యాడు. తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగినని నమ్మించి రూ.15 లక్షల నగదు, 13 సవర్ల బంగారు కట్నకానుకుల కింద తీసుకున్నాడు. ఈ క్రమంలో భర్త అమీర్‌ఖాన్ అమ్మాయిల బ్రోకర్ అని తెలియడంతో భార్య ప్రశ్నించగా.. దాడి చేశాడు. ఆమె నెల్లూరు చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. బుధవారం మంత్రి జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రూ.64 వేల కోట్లతో 5000 ఎకరాలలో రాజధాని నిర్మిస్తామని, ఇప్పటికే రూ.50 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ పాల్గొన్నారు.
ఈ నెల 7వ తేదీన నెల్లూరు వి.ఆర్.సి గ్రౌండ్‌లో చికెన్ & ఎగ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖాధికారి కె. రమేశ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్ ముఖ్య అతిథులుగా కానున్నారు. కోళ్ల ఫారం యజమానులు, చికెన్, కోడిగుడ్ల వ్యాపారులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బర్డ్ ఫ్లూ గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
రైతుల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు. బుధవారం బోగోలు మండలం చెంచులక్ష్మిపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ, సొసైటీ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.
జిల్లాలోని విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని జిల్లా విద్యుత్ SE వి. విజయన్ కోరారు. బుధవారం ఆయన కార్యాలయంలో జిల్లాల్లోని ఇంజనీరింగ్ అకౌంట్స్ విభాగం సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించాలన్నారు. విద్యుత్ పోల్స్‌కు అల్లుకున్న తీగలను తొలగించి, నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు.
మనుబోలు మండలంలోని మనుబోలు రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూముల రీసర్వే ప్రక్రియ పర్యవేక్షణకు మనుబోలు మండలానికి వచ్చిన ఆయన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం తేమశాతం, కొనుగోలు కేంద్రం రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
అనంతసాగరం మండలంలో బుధవారం ఓ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోమశిల జలాశయంలో మృతదేహం నీటిపై తేలాడుతుండగా స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, జాలర్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.