Nellore

News August 19, 2024

మరికాసేపట్లో సోమశిలకు ముఖ్యమంత్రి రాక

image

మరికాసేపట్లో సోమశిలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన గురుకుల పాఠశాల వద్ద హెలిపాడ్ వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జలాశయం వద్ద నుంచి గ్రామంలో వరకు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే భారీగా కూటమి నాయకులు చేరుకున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమశిలకు చేరుకున్నారు.

News August 19, 2024

CM చంద్రబాబుకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే విజయశ్రీ

image

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం హెలికాప్టర్‌లో శ్రీసిటీ హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఆయనకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబుకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

News August 19, 2024

నెల్లూరు: యువకుడు పెళ్లి చేసుకోలేదని యువతి సూసైడ్

image

యువకుడు పెళ్లి చేసుకోలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం .. నెల్లూరు ముత్యాలపాలెంలో వెంకటరమణ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జీవిత(19)కు ఇన్‌స్టాగ్రాంలో రామూర్తి నగర్‌కు చెందిన ప్రతాప్‌తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొంతకాలంగా వివాహం చేసుకోమని కోరుతుండగా ఆతడు కాలయాపన చేయడంతో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

News August 19, 2024

కావలి: పెళ్లి చేసుకుంటానని బాలికకు గర్భం చేశాడు

image

పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో లొంగదీసుకుని బాలికకు గర్బం చేసిన ఉదంతం కావలిలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన బాలిక ప్రకాశం జిల్లా దర్శిలో అమ్మమ్మ వద్దకు వెళ్లింది. అక్కడ వరుణ్ సాయి అనే వ్యక్తి ప్రేమిస్తున్నట్లు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవల నీరసంగా ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకెళితే గర్భం దాల్చినట్లు తేల్చారు. బాలిక తల్లిదండ్రులు కావలి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News August 19, 2024

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

నెల్లూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజాసమస్యల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి అధికారులు ఒక ప్రకటనను విడుదల చేశార., సోమవారం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్నందున రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయం గమనించాలని కోరారు.

News August 19, 2024

నేడు సీఎం చంద్రబాబు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటన వివరాలు

image

సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీసిటీకి వెళ్లతారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని ప్రభుత్వం తెలిపింది.

News August 19, 2024

శ్రీసిటీలో 15 కంపెనీలను ప్రారంభించనున్న చంద్రబాబు

image

శ్రీసిటీలో 15 పరిశ్రమలను CM చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. శ్రీసిటీలో రూ.1570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా సుమారు 8480 మందికి ఉపాధి లభిస్తుంది. ఆరు పరిశ్రమల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మరో ఐదు పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఒప్పందాలు కురుర్చుకోనున్నారు. వీటి ద్వారా 4060 మందికి ఉపాధి లభించనుంది.

News August 19, 2024

24 టీఎంసీలకు చేరిన సోమశిల జలాశయం

image

సోమశిల జలాశయానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎగువ ప్రాంతాల నుంచి 10,620 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరధ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 24.191 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17, 18 స్లూయిస్ ద్వారా పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 115 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

News August 18, 2024

రేపు నెల్లూరు జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సోమశిల ప్రాజెక్టు రిజర్వాయర్‌ను పరిశీలించుటకు హెలికాప్టర్‌లో వస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు సోమశిల రిజర్వాయర్ వద్ద హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

News August 18, 2024

నెల్లూరులో వెలుగు చూసిన ఘరానా మోసం

image

నెల్లూరులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మనీ స్కీం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ట్రస్ట్ పేరుతో జనాలకు టోకరా వేశారు. బాధితుల వివరాలు మేరకు.. చెన్నైకి చెందిన ఓ సంస్థ నెల్లూరు పొదలకూరు రోడ్డు వద్ద ఇంకో ట్రస్ట్ సహాయంతో ఒక సభ్యత్వానికి రూ.500 కడితే రూ.7లక్షలు, మరో సభ్యత్వానికి రూ.5 వేలు కడితే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 10 వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారని బాధితులు లబోదిబోమన్నారు.