India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈగా కొండూరు రాఘవేంద్రం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన విజయన్ తిరుపతి జనరల్ మేనేజర్ గా బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా కొత్త ఎస్ఈ జిల్లా వాసి కావడం విశేషం. ఈయన సత్యసాయి జిల్లాలో పనిచేస్తూ నెల్లూరుకు వచ్చారు.

CIనంటూ ఓ వ్యక్తి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఘటనపై కేసు నమోదైంది. నెల్లూరు రూరల్ న్యూ మిలిటరీ కాలనీలో బీటెక్ పూర్తి చేసిన వినోద్ కేఫ్‌లో పని చేస్తున్నాడు. అక్కడకు రోజూ కారులో యూనిఫాం ధరించి వచ్చే సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. తాను క్రైమ్ బ్రాంచ్ సీఐ అని అంటూ వినోద్‌కు ఉద్యోగం ఎరగా వేసి రూ.6లక్షలకు పైగా ఆరు సవర్ల బంగారు దండుకున్నాడు. చివరికి ఉద్యోగం ఇప్పింకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

కలువాయి మండలం ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన సుటెటి విష్ణు వర్ధన్ (9), మనుబోటి నవ శ్రవణ్ (12) చిన్నారులు అదృశ్యమయ్యారు. దసరా సెలవులకి కావడంతో సరదాగా బయటకు వెళ్లిన చిన్నారులు రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటారేమో అన్న అనుమానంతో గ్రామస్థులు సమీప బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు.

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా బుధవారం అమ్మవారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP)లో భాగంగా నెల్లూరుకు 2025-26 సంవత్సరానికి రు.13.50 కోట్లు మంజురైనట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిధుల వినియోగానికి సంబంధించి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎండ్ టు ఎండ్ పేవింగ్, గ్రీనరీ డెవలప్‌మెంట్, మెకానికల్ రోడ్ స్వీపింగ్, దుమ్ము నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GST 2.0 వ్యవసాయం, పారిశ్రామిక, భవన నిర్మాణం, విద్యారంగం, వర్తక రంగాలకు ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసరాలు, మెడిసిన్, వ్యసాయ పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఆటోమొబైల్ రంగాల్లోని ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గిందన్నారు.

ఏపీ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్‌గా టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. చాలా ఏళ్ల నుంచి సోమిరెడ్డి అనుచరుడిగా శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతున్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు అరుదైన అవకాశం వచ్చింది. ఇవాళ ఉదయం శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు సభను ప్రారంభించారు. కొన్ని చర్చల తర్వాత ఆయన రెస్ట్ తీసుకున్నారు. ఆ సమయంలో ఛైర్మన్ హోదాలో రవిచంద్ర ఆ కుర్చీలో కూర్చొని సభను నడిపించారు. సభ్యుల ప్రశ్నోత్తరాల సమయానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూశారు.

డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో గురువారం నియామక పత్రాలు అందజేస్తామని నెల్లూరు డీఈవో బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారంతా నేటి సాయంత్రం 4 గంటలలోపు గొలగమూడి ఆశ్రమం వద్దకు రావాలని సూచించారు. ఇక్కడి నుంచి బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.

సినిమా పైరసీ వ్యవహారం నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతోంది. సీతారాంపురం మండలానికి చెందిన ఓ యువకుడు సినమా పైరసీ చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సీతారాంపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి సదరు యువకుడికి హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. సీతారాంపురం యువకుడితో పాటు మరికొందరు పాత్ర పైరసీ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.