India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్జీలను అధికారిక వెబ్సైట్ Meekosam.ap.gp.inలో సైతం ఇవ్వొచ్చని కలెక్టర్ తెలిపారు.

నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో చర్చించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయంపై ఇరువురు నేతల అంగీకారం తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.

గ్రామీణ నిరుద్యోగ యువతకు వెంకటాచలంలో ఉన్న స్వర్ణభారత్–సోమా సాంకేతిక శిక్షణా సంస్థ ఓ ఆశాదీపంగా నిలిచింది. డిమాండ్ ఉన్న రంగాలలో సాంకేతిక నిపుణులతో ఉచిత శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. గడచిన 14 ఏళ్లలో 5,420 మంది ఇక్కడ శిక్షణ పొందగా 80% మందికి పైగా యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.

కావలి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించగలరు.

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమలేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు NMC అధికారులు మరోసారి అవకాశం కల్పించారు. BPS పథకంలో భాగంగా 1985 నుంచి 2025 ఆగస్టు వరకు అనధికారికంగా, అనుమతికి మించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేందుకు వచ్చే ఏడాది మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1113, 7981651881 నంబర్లను సంప్రదించాలని కమిషనర్ నందన్ కోరారు.

ఇందుకూరుపేట(M) కుడితిపాలెం సమీపంలోని పెన్నా నది ఐలాండ్‌లో పేకాటాడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. SP అజిత పర్యవేక్షణలో రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు చేపట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా పేకాట రాయుళ్ల కదలికలను పసిగట్టి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3లక్షల నగదు, 3కార్లు, 6 బైక్‌లు, 14 ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.

నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా ఎల్.శ్రీధర్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా పంచాయతీ అధికారిగా ఉంటూ జడ్పీ సీఈవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.