India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర విదేశాంగ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో సభ్యుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈయనకు మాత్రమే ఈ అవకాశం లభించింది. కాగా తనకు బాధ్యతను అప్పగించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అనేక కీలక పదవులు లభించడంతో జిల్లా వాసులు అభినందనలు తెలియజేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తున్నట్లు DSO డి.వెంకటరమణ తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇతర డేటా బేస్‌తో సరిపోలిన వారు అర్హులన్నారు. ఎల్పీజీ కనెక్షన్, ఆధార్, రేషన్ కార్డు ధ్రువీకరణ కలిగి ఉండి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ అనుసంధానమై ఉండాలని ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పట్ల పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. శనివారం నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను సత్వర పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. లైసెన్స్ కలిగిన విక్రయదారులు మాత్రమే బాణాసంచా దుకాణాలు నిర్వహించాలన్నారు.
పెళ్లకూరు మండలం నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారి మార్గంలోని టెంకాయ తోపు గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో కంటైనర్ లారీ డ్రైవర్ ఫిరోజ్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. కంటైనర్ లారీ ముందు భాగం కాలిపోయింది.
దానా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో సింహపురి ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శనివారం సికింద్రబాద్ నుంచి వచ్చే(12710) రైలు రద్దు చేయగా, ఆదివారం గూడూరు నుంచి సికింద్రబాద్ వెళ్లే(12709) రైలు కూడా రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు.
తడ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు మాంబట్టు సెజ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న వరదయ్యపాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్‌గా పోలీసులు గుర్తించారు. ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం నెల్లూరులో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకాణిని సత్కరించారు. జిల్లాలో వైసీపీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది. కాకాణికి ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలోని 2,594 గృహాల నిర్మాణం కోసం రూ.6.43 కోట్ల నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆత్మకూరు 238, కందుకూరు 312, కావలి 460, కోవూరు 322, నెల్లూరు సిటీ 24, నెల్లూరు రూరల్ 88, సర్వేపల్లి 510, ఉదయగిరి 544, వెంకటగిరి 94 గృహాలకు బిల్డింగ్ సామాగ్రి చెల్లింపుల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. మార్చి 2025లోపు నిర్మాణాలు పూర్తి కావాలన్నారు.
అనంతసాగరం మండలం నల్లరాజుపాలెం వద్ద శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి సోమశిల ఉత్తర కాలువలో బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఆత్మకూరుకు చెందిన ట్రాక్టర్ మెకానిక్ సాదిక్ అలియాస్ బాబుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జి.కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 15 మంది పోలీసుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫర్లు, రిక్వెస్ట్‌లు, మెడికల్ సమస్యలను వారు ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.