Nellore

News September 13, 2025

కాసేపట్లో కొత్త కలెక్టర్‌ బాధ్యతలు.. సమస్యలు ఇవే.!

image

నెల్లూరు కొత్త కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా శనివారం సా.5.30 గం.కు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు పలు కీలక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. GGHలో అధ్వాన పరిస్థితులు, కరేడు భూముల వివాదం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఆస్పత్రుల సేవల మెరుగు, పెన్నా పొర్లుకట్టలు, చెరువుల పటిష్టత, ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటిపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

News September 13, 2025

నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ

image

నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అజిత వేజెండ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News September 13, 2025

నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి మైథిలి కళ్లు దానం

image

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.

News September 13, 2025

ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విషజ్వరాలు

image

ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలలో విష జ్వరాలు కలకలం సృష్ఠించాయి. పలువురు విద్యార్థినులు విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం. శుక్రవారం స్కూల్లో అధికారులు మెడికల్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులకు చికిత్స అందించారు. ఆత్మకూరు గురుకుల పాఠశాల విద్యార్థినులకు విషజ్వరాలు రావడంతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. స్కూల్‌ వద్దకు వెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News September 13, 2025

నెల్లూరు: ఆ బార్లకు రీ నోటిఫికేషన్

image

జిల్లాలో నిర్వహించకుండా ఓపెన్ కేటగిరిలో ఉన్న 32 బార్లకు, గీత కులాల రిజర్వుడు కింద ఉన్న 1 బార్ కి సంబంధించి రీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా నిషేధ, ఎక్సైజ్ శాఖాధికారి తెలిపారు. ఈ నెల 17న దరఖాస్తుల స్వీకరణ, 18 న లాటరీ, ఎంపిక ప్రక్రియలను చేపట్టానున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఈ మార్పు చేసిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు చేయాలని కోరారు

News September 13, 2025

నెల్లూరులో యువతి దారుణ హత్య!

image

నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురు ఇంట్లో ఉంటూ చనువుగా ఉండేవారు. గత అర్ధరాత్రి యువకుడితో మాట్లాడడానికి ఆ యువతి వెళ్లింది. ఈ క్రమంలో యువతిని పొడిచి చంపిన యువకుడు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 13, 2025

ఉలవపాడు: జ్యువెలరీ షాప్ సిబ్బందిని బురిడి కొట్టించిన కిలా(లే)డీలు

image

ఉలవపాడులోని ఓ జ్యువెలరీ షాప్‌లో శుక్రవారం 4 జతల బంగారు కమ్మలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. బంగారు కమ్మలు కొనడానికి వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు షాపు సిబ్బందిని బురిడి కొట్టించి 4 జతల గోల్డ్ కమ్మలు మాయం చేశారు. ఆ తర్వాత గుర్తించిన షాపు సిబ్బంది రూ.లక్ష విలువైన సొత్తు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI అంకమ్మ తెలిపారు.

News September 12, 2025

ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

image

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.

News September 12, 2025

నత్తనడకన రామాయపట్నం పోర్టు పనులు!

image

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.

News September 12, 2025

మిస్టరీగా కావలి మాజీ MLA జాడ?

image

మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది కావలిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హత్యాయత్నం కేసులో ఇరుక్కున్న వెంటనే ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెంగళూరులో ఉండొచ్చని కొందరు.. కాదు కాదు ఆయన దేశం దాటి శ్రీలంక వెళ్లుంటారంటూ మరికొందరి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన జాడ మిస్టరీగా మారింది.