Nellore

News March 27, 2026

నెల్లూరు అభివృద్ధికి రూ.850 కోట్లు కేటాయింపు: మంత్రి నారాయణ

image

అభివృద్ధి తమ ఎజెండాగా పని చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఎనిమిదవ డివిజన్లో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు పార్కును ప్రారంభించారు. జూన్ 12 కల్లా నెల్లూరు సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి రూ.850 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందన్నారు.

News March 26, 2026

నెల్లూరు: బస్సు ప్రమాదంలో తల్లీ కుమార్తె దుర్మరణం

image

మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో కొండాపురం మండలం తూర్పు యర్రబల్లికి చెందిన తల్లీ, కుమార్తె మృతి చెందారు. తూర్పుయర్రబల్లికి చెందిన నర్సింగు శ్రీను, అతని భార్య ప్రభావతి, కుమార్తె చైత్ర బేల్దారీ పనులు చేసుకుంటూ జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ప్రభావతి తన కుమార్తె చైత్రతో కలిసి పొదిలి మండలం ఉన్నగురవాయపాలెంలోని పుట్టింటికి వస్తుండగా బస్సు ప్రమాదంలో చిక్కుకుని ఇద్దరూ మృతి చెందారు.

News March 26, 2026

నెల్లూరు జిల్లాకు 9 పశు ఔషధీ విక్రయ కేంద్రాలు మంజూరు

image

జిల్లాకు నూతనంగా 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మంజూరైనట్లు జిల్లా కలెక్టరు హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరు వారి చాంబర్‌లో పశుసంవర్థకశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నూతనంగా మంజూరు చేసిన 9 పశు ఔషధి విక్రయ కేంద్రాలను త్వరగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 26, 2026

నెల్లూరు: ఘోర ప్రమాదం.. సంచలన విషయాలు

image

మార్కాపురంలో ప్రమాదం జరగకముందే బస్సు కండిషన్ బాగోలేదని ప్రయాణికులు డ్రైవర్‌కు చెప్పారంట. జగిత్యాల నుంచి నెల్లూరు(D) వింజమూరుకు నిన్న సాయంత్రం ఈ బస్సు బయల్దేరింది. ఎర్రగొండపాలెం వద్ద మరమ్మతులకు గురికావడంతో గంటపాటు రిపేర్ చేశారని సమాచారం. సంక్రాంతి సమయంలోనూ ఈ బస్సుకు భారీగా ఫైన్ పడినట్లు తెలుస్తోంది. మార్కాపురం వద్ద స్టీరింగ్ స్ట్రక్ట్ కావడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ అధికారుల విచారణలో చెప్పాడు.

News March 26, 2026

నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్

image

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బాధితుల సహాయార్థం నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 7995575699, 08612331261 నంబర్లకు ప్రజలు కాల్ చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. జిల్లాకు చెందిన 15 మంది ప్రయాణికులు ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నట్లు సమాచారం.

News March 26, 2026

ఘోర ప్రమాదంలో నెల్లూరోళ్లు..!

image

మార్కాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఢీకొని 13మంది చనిపోయిన విషయం తెలిసిందే. 23మంది గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి(M) దాసరపల్లికి చెందిన ఇద్దరు ప్రయాణికులు ఇదే బస్సులో వచ్చారు. బీసీ కాలనీకి చెందిన డబ్బుకొట్టు కిరణ్ సురక్షితంగా బయటపడ్డారు. ముత్తంగి వెంకటేశ్వర్లు ఆచూకీ లభ్యం కాలేదు. బిజ్జంపల్లి అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన కోసినపోగు ప్రకాష్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

News March 25, 2026

నెల్లూరు: 30 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

2025-26 సంవత్సరానికి గాను జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు గ్రూప్ -4 సర్వీసులో భర్తీ కానీ 30 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత జిల్లా శాఖ అధికారి మహమ్మద్ అయూబ్ తెలిపారు. బ్యాక్‌లాగ్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసే విధానం, నోటిఫికేషన్, దాని సూచనలు https://spsnellore.ap.gov.in వెబ్‌సైట్‌లో Recruitment/Notices టాబ్‌లో అప్లికేషన్ పూర్తి చేసి ఏప్రిల్ 15లోగా దరఖాస్తులను అందజేయాలన్నారు.

​నెల్లూరు కలెక్టర్, ఎస్పీ కీలక నిర్ణయం

image

నెల్లూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో జరిగిన NCORD సమావేశంలో జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలని, డ్రోన్ల ద్వారా నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో అవగాహన పెంచుతూ, NDPS చట్టం కింద నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.