Nellore

News October 19, 2024

నెల్లూరు: ప్రేమోన్మాది ఘాతుకం.. లవర్‌పై బ్లేడ్‌తో దాడి

image

శ్రీకాళహస్తి మండలం చోడవరానికి చెందిన ముధుసూదన్‌రెడ్డి(22), అదే గ్రామానికి చెందిన యువతి(21) నెల్లూరు జిల్లాలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదివారు. ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. IT కోర్సు నేర్చుకోవడానికి హైదరాబాద్‌‌కు వెళ్లారు. ఇటీవల మద్యం, ఇతర వ్యసనాలకు బానిసవడంతో మధుసూదన్‌రెడ్డిని యువతి దూరం పెట్టింది. కోపం పెంచుకున్న యువకుడు గురువారం సాయంత్రం SR నగర్‌లో యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడు

News October 19, 2024

గూడూరులో ఉదయాన్నే భారీ వర్షం

image

గూడూరులో శనివారం ఉదయాన్నే భారీ వర్షం కురిసింది. చిల్లకూరు, చింతవరం, మనుబోలు, చెన్నూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నారు మడులకు సీజన్ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

News October 19, 2024

నెల్లూరు జిల్లాలో ఇసుక టెండర్లు రద్దు 

image

నెల్లూరు జిల్లాలో జరిగిన ఇసుక టెండర్లను కలెక్టర్ ఓ.ఆనంద్ రద్దు చేశారు. ఇసుక రీచ్‌లకు కొందరు గుత్తేదారులు తక్కువ ధరకు కోట్ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇసుక రీచ్‌లను గురువారం లాటరీ లాటరీ పద్ధతిన గుత్తేదారులకు కేటాయించిన విషయం తెలిసిందే. తిరిగి రీ టెండర్లకు వెళ్లేలా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

News October 18, 2024

పోలీస్ సిబ్బంది సమస్యలపై ఎస్పీ ఆరా

image

నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణకాంత్ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. 19 మంది పోలీసులు బదిలీ రిక్వెస్టులు, మెడికల్ ఇష్యూస్, సస్పెన్షన్ ఎత్తివేత తదితర సమస్యలపై ఎస్పీకి వినతులు సమర్పించారు. ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. పలు సమస్యలపై అప్పటికప్పుడే అధికారులకు సూచనలు చేశారు.

News October 18, 2024

NLR: రైతులకు అందుబాటులో ఎరువులు

image

నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ వరి సాగు సౌకర్యార్థం విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ అధికారిణి P.సత్యవాణి ఓ ప్రకటనలో తెలిపారు. BPT-5204, KNM-1638, NLR-34449 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. DAP, MOP, కాంప్లెక్స్ ఎరువులను రైతు సేవా కేంద్రంలో ఉంటాయని.. అవసరమైన వాళ్లు తీసుకోవాలని సూచించారు. 

News October 18, 2024

సింహపురి ట్రైన్ టైం మారింది..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు కీలకంగా ఉన్న సింహపురి ట్రైన్ రాకపోకల సమయం మారింది. ఇవాళ(శుక్రవారం) రాత్రి నుంచే సికింద్రాబాద్‌లో 10.05(పాత టైం 11.05) గంటలకు బయల్దేరుతుంది. కావలికి ఉదయం 6.59 గంటలకు, నెల్లూరుకు 7.58 గంటలకు చేరుకుంటుంది. చివరగా గూడూరుకు 8.55 గంటలకు వస్తుంది. గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే సింహపురి ట్రైన్ టైంలో మాత్రం మార్పు లేదు.

News October 17, 2024

నెల్లూరు SP కార్యాలయంలో వాల్మీకి జయంతి 

image

నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నేడు వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి SP జి.కృష్ణకాంత్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి మిఠాయిలు పంచి పెట్టారు. SP మాట్లాడుతూ.. రామాయణం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పెంపొందించుకోవాలన్నారు.  

News October 17, 2024

నెల్లూరు: ఊపిరి పీల్చుకున్న ప్రజలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత నాలుగు రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలను భయపెట్టింది. ఏకంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు భారీ వర్షాలతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. గత నాలుగు రోజులుగా జనజీవనం స్తంభించింది. ఎట్టకేలకు కాసేపటి క్రితం తడ వద్ద వాయుగుండం తీరం దాటింది అని తెలియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

News October 17, 2024

తడ వద్ద తీరం దాటిన వాయుగుండం

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలను భయపెట్టిన వాయుగుండం నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. కాసేపటి క్రితం తడ వద్ద వాయుగుండం తీరాన్ని తాకినట్లు అధికారులు ప్రకటించారు. ఈక్రమంలో నిన్న రాత్రి నుంచి జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. వాయుగుండం తీరం దాటడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. వాయుగుండ బలహీన పడినప్పటికీ ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

News October 17, 2024

నెల్లూరులో సండే మార్కెట్ దారి బంద్ 

image

నెల్లూరు నగరంలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు వీధులు, ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. దీంతో అధికారులు సండే మార్కెట్ రహదారిని మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.