Nellore

News March 25, 2026

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : మెప్మా పీడీ

image

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరించాలని మెప్మా పీడీ లీలారాణి అధికారులకు సూచించారు. మంగళవారం బుచ్చి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, ధాన్యం మండీలను వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలులో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన కొనుగోలు కేంద్రాలలో రైతుల వద్ద ధాన్యం సేకరించాలని తెలిపారు.

News March 24, 2026

రాపూరు వస్తే.. అవకాశం ఎవరికి..!

image

కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో నెల్లూరు జిల్లాలో మరలా ఊహగానాలు మొదలయ్యాయి. 1952లో ఏర్పాటైన రాపూరు నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా 2008లో ఈ ప్రాంతం శాసనసభ స్థానాల నుంచి తొలగించబడింది. 1952 నుంచి 2004 వరకు జరిగిన ఎలక్షన్స్‌లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరలా రాపూరు నియోజకవర్గాన్ని ప్రకటిస్తే రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది.

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో సదరం స్లాట్ ప్రారంభం

image

నెల్లూరు జిల్లాలో కొన్ని ఏళ్లుగా దివ్యాంగులు సదరం స్లాట్ల బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని అన్ని సచివాలయాల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సమాచారం అందుకున్న దివ్యాంగులు ఆయా సచివాలయాలకు సమగ్ర వివరాలతో వెళ్లి నమోదు చేయించుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్ వెంట తీసుకుని వెళ్లాలి.

News March 24, 2026

నెల్లూరు: రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఒకరు చనిపోయారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న రైలు నుంచి జారిపడి సోమవారం రాత్రి ఒకరు మృతిచెందారు. అతని వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చు. 5.4 అడుగుల ఎత్తు చామన ఛాయ రంగు కలిగి ఉన్నాడు. గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్యాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్ఐ హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2026

కావలి: సార్.. నేనే బతికే ఉన్నా..!

image

నెల్లూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. కావలి మండలం అన్నగారిపాలేనికి చెందిన బొబ్బల రమణమ్మ ఆధార్ కార్డు తీసుకుని రేషన్ షాపు వద్దకు వెళ్లారు. బియ్యం ఇవ్వాలని అడిగితే ‘నువ్వు చనిపోయావని చూపిస్తోంది. నీకు బియ్యం ఇవ్వడం కుదరదు’ అని డీలర్ చెప్పారు. తానే బతికే ఉన్నానని.. ప్రతినెలా పెన్షన్ కూడా ఇస్తున్నారని ఆమె చెప్పారు.

News March 24, 2026

నెల్లూరు: ఇళ్లను నిర్మించని ఏజెన్సీలకు నోటీసులు

image

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాలకు కొన్ని ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. చాలా ఏజెన్సీలు ఇళ్ల పనులను మధ్యలో నిలిపి వేశాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో 29 ఏజెన్సీలకు కలెక్టర్ హిమాన్షూ శుక్లా నోటీసులు జారీ చేశారు. 399 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సమాచారం.

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో కొత్త MLA సీట్లు ఇవేనా..?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనతో <<19461748>>MLAల సంఖ్య <<>>10 నుంచి 15కి పెరిగే అవకాశం ఉంది. 2009కి ముందు రాపూరు, అల్లూరు నియోజకవర్గాలు ఉండేవి. వీటిని పునరుద్ధరించే అవకాశం ఉంది. 8మండలాలతో ఉదయగిరి, 6మండలాలతో సూళ్లూరుపేట, ఆత్మకూరు పెద్ద నియోజకవర్గాలుగా ఉన్నాయి. వీటి విభజనతో కొత్తది ఏర్పడవచ్చు. ఓట్ల పరంగా నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు మరోక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!

image

ఏపీలో MLA, MP స్థానాలు <<19460921>>పెంపుపై <<>>కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనూ సీట్ల సంఖ్య 50శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10 MLA సీట్లు 15కు పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు ఎంపీతో పాటు కొన్ని నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ కింద ఉన్నాయి. కొత్త బిల్లుతో జిల్లాలోనే 2 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది.

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో కొత్త విధానం

image

నెల్లూరు జిల్లాలోని అన్ని వీధి లైట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చామని విద్యుత్తు శాఖ ఎస్ఈ కె.రాఘవేంద్రం తెలిపారు. రోజూ సాయంత్రం 5:30 గంటలకు ఆటోమేటిక్‌గా లైట్లు ఆన్ అవుతాయని చెప్పారు. ఉదయం 6:00 గంటలకు ఆఫ్ అవుతాయని చెప్పారు. ఈ మార్పులతో వాటర్ వర్క్స్ సరఫరాకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత AE లేదా DEEలను సంప్రదించాలని సూచించారు. వారికి ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

News March 23, 2026

ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసిన వేమిరెడ్డి దంపతులు

image

భారత ప్రధానిగా ఎక్కువ కాలం సేవలందించిన ప్రధాని మోదీకి వేమిరెడ్డి దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీలో ప్రధానిని కలిసి పూల బొకే ఇచ్చారు. ఈ సందర్భంగా MP ప్రభాకర్ రెడ్డి, MLA ప్రశాంతి రెడ్డి మాట్లాడారు. ప్రధానిగా 8,931 రోజులు కంటే ఎక్కువ కాలం పని చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. వికసిత భారత్ లక్ష్యాన్ని 2047లోగా ఆయన సాధించేలా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని కోరినట్లు వారు తెలిపారు.