India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో విద్యాసంస్థలు సోమవారం నుంచి పునః ప్రారంభించాల్సి ఉంది. దసరా పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి 13వ తేదీ వరకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేడు తెరచుకోవాల్సిన విద్యాసంస్థలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో .. ప్రభుత్వం అకస్మాత్తుగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
నెల్లూరు జిల్లాలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆనంద్ అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించార. ప్రజలు అత్యవసర సమయంలో 0861-2331261, 7995576699 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
ఏఎస్ పేట ఎమ్మార్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ శ్రీరామకృష్ణ తెలిపారు. జిల్లాలో తుఫాన్ ప్రకటన నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో 9177504901 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది అయినా ఈ నంబరును సంప్రదించవచ్చని తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూన్ నెలలో డిగ్రీ (UG) B.A/B.COM/BSC/BCA/BBA/BA 4వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
చిల్లకూరు మండలం, కోట క్రాస్ రోడ్డు సమీపంలో గత రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన క్షతగాత్రుడిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించే క్రమంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీసు వాహనాలు ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ప్రారంభించారు. జిల్లాలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఆలయాలు అమ్మవారి ప్రతిమల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మైపాడు: దసరా శరన్నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో అనేకమంది ప్రజలు కుటుంబ సమేతంగా మైపాడు బీచ్ చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు. మైపాడు బీచ్ సముద్ర తీరం పర్యాటకులతో సందడిగా మారింది.
నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మూడు రోజులు పర్యటించనున్నారు. అక్టోబర్ 13,14, 15 వ తేదీలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత పది రోజులుగా విజయవాడ, తిరుమల, శ్రీశైలంలోని దసరా ఉత్సవాలలో పాల్గొని జిల్లా పర్యటనకు వస్తున్నారు.
కవరైపెట్టె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్(12578) ఢీకొనడం వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉన్నట్లు భారతీయ రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)తో విచారణ చేయించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలుస్తాయని దక్షణమధ్య రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ తెలిపారు. తిరవళ్లూరు వద్ద పనులు చేపట్టి రైళ్ల రాకపోకలు పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామన్నారు.
నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల కోసం గడువు ముగిసే సమయానికి 3,833 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు అధికారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో మొత్తం 182 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కాగా దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.76.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు వారు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.