India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కౌమారి పూజను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి స్వరూపంగా ఓ చిన్నారికి బాలత్రిపుర సుందరి అలంకారం చేసి పూజలు జరిపారు. అనంతరం ఆ చిన్నారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పోటీపడ్డారు. మరోవైపు బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దోచుకోవడంలో సర్వేపల్లి MLA సోమిరెడ్డి దిట్ట అని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆడపాల ఏడుకొండలు ఆరోపించారు. నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లిలో సోమిరెడ్డి దోపిడీపై ప్రశ్నించిన వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగతన్నారు. సోమిరెడ్డికి దమ్ముంటే తన అవినీతిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్పీ నాయకులు నరసయ్య, కృష్ణ, రఘు, శివ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.
తెలంగాణలో మద్యం వ్యాపారం చేస్తున్న పలువురు ఇప్పుడు నెల్లూరులో షాపులపై గురిపెట్టారు. అక్కడ ఉన్న అనుభవంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో దుకాణాలను పొందేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఓ వ్యాపారి 100కి పైగా దరఖాస్తులను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బంధువులు, స్నేహితులతో కలిసి ఆయన అదృష్టం పరీక్షికునేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.
జిల్లాలో ఇసుక విధానం మీద కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేషన్ టీంను సచివాలయ ఉద్యోగులతో ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇసుక సకాలంలో సరఫరా అయ్యేందుకు ఇది పనిచేస్తుందన్నారు. ఇసుక ఫిర్యాదులు, సమాచారం, సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 0861– 2943569ను సంప్రదించాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత వాకాటి నారాయణరెడ్డికి సోమవారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ వాకాటి నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. రూ.15 కోట్లు ఇవ్వాలని లేకుంటే వివిధ కేసుల్లో అరెస్ట్ చేస్తామని వాకాటి నారాయణరెడ్డిని బెదిరించారు. దీంతో ఆయన నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఈయన ఆగస్టు 29వ తేదీ రాజ్యసభ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరునున్నారు. 2019 డిసెంబర్‌లో ఈయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.
వాకాడు మండలం రాగుంటపాలెం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన వాకాడు మండల టీడీపీ బీసీ సెల్ నాయకుడు చెన్నపట్నం జమిందార్ బాబు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన నాయకులను టీడీపీలో చేర్చుకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దన్నారు.
గూడూరు నుంచి పనుల మీద రాపూరు వచ్చిన శివ అనే యువకుడు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. తూర్పు ఆగర్త కట్టకు వెళ్లే దారిలో శివ నడచి వెళ్తూ అకస్మాత్తుగా కింద పడిపడి గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు రాపూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఏఎస్ఐ వెంకటేశ్వర రావు ఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. మృతదేహన్ని ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.
కొడవలూరు పరిధిలోని యల్లాయపాలెంలో 01.08.2022 న ఓ బాలిక(12)పై పలుమార్లు అత్యాచారం లైంగిక దాడకి పాల్పడినట్లు పొక్సోకేసు నమోదైంది. ఈ కేసులో మన్నేపల్లి@తాటలపూడి వెంకటరమణయ్య అనే ముద్దాయికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.20,000 జరిమానా కోర్టు విధించినట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పేర్కొన్నారు. జిల్లా పోక్సో కోర్టు జడ్జి శిరిపిరెడ్డి సుమ విచారణ పూర్తి చేసి శిక్ష విధించినట్లు తెలిపారు.
సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Sorry, no posts matched your criteria.