India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దిగుమతిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈక్రమంలో నెల్లూరు జిల్లాలో గడిచిన 10రోజుల్లోనే లక్ష సిలిండర్లను బుక్ చేశారు. సాధారణంగా నెలకు 40 వేల నుంచి 50 వేల వరకు డొమెస్టిక్ సిలిండర్లు బుక్ అయ్యేవి. గ్యాస్ కొరత వస్తుందేమోననే భయంతో ప్రజలు ఎగబడటంతో బుకింగ్ సంఖ్య లక్షకు చేరింది. సిలిండర్లకు ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తూనే ఉన్న ప్రజలు భయాందోళన వీడటం లేదు.

ఒక్కసారి జరిగితే తప్పు. అదే పదేపదే జరిగితే నేరం. ప్రస్తుతం నెల్లూరులో జరిగేది ఇదే. రాజకీయ నేతల అండదండలతో రేషన్ బియ్యాన్ని దోచేస్తున్నారు. 2025లో 73 కేసులు నమోదు చేసి 2400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. 2026లో 14 కేసులు నమోదు చేసి 650.8 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 15 నెలల్లోనే రూ. 1.37 కోట్ల ధాన్యం పట్టుబడింది. మాఫియాకు అధికారులు సైతం అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.

రంజాన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఇటీవల ఏపీ తీరంలోకి వచ్చిన తమిళనాడు బోట్లను మత్స్యకారులు పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్‌లో నిలిపారు. అల్లూరు(M) ఇస్కపాలెంలోని పల్లిపాలేనికి చెందిన పెద్దకాపు వర్గం వీటిని విడుదల చేయించిందని సమాచారం. ఆగ్రహానికి గురైన మత్స్యకారులు ఆ పెద్ద మనిషి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టి నిర్భంధించారని తెలుస్తోంది. బోట్ల విడుదల వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నారని సమాచారం.

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఇటీవల ఏపీ తీరంలోకి వచ్చిన తమిళనాడు బోట్లను మత్స్యకారులు పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్‌లో నిలిపారు. అల్లూరు(M) ఇస్కపాలెంలోని పల్లిపాలేనికి చెందిన పెద్దకాపు వర్గం వీటిని విడుదల చేయించిందని సమాచారం. ఆగ్రహానికి గురైన మత్స్యకారులు ఆ పెద్ద మనిషి, కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టి నిర్భంధించారని తెలుస్తోంది. బోట్ల విడుదల వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నారని సమాచారం.

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.

బైకును కంటైనర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన మనుబోలు హైవేపై చోటుచేసుకుంది. ఎస్సై శివ రాకేశ్ కథనం మేరకు.. కలువాయికి చెందిన శెట్టి పల్లి రమేశ్ (40) బైక్‌పై మల్లాంలో జరగబోయే వివాహానికి వెళుతుండగా చెన్నై వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొంది. ఈప్రమాదంలో రమేశ్ అక్కడక్కడే మృతి చెందాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పదో తరగతి పరీక్షలులో భాగంగా శనివారం 21వ తేదీన జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడినట్లు ఉదయగిరి ప్రాంత పరీక్షల నిర్వహకులు తోట శ్రీనివాసులు ఒక ప్రకటన తెలిపారు. 21వ తేదీన ఈద్ – ఉల్ – ఫితర్ (రంజాన్ ) పర్వదినం రావడంతో ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

నెల్లూరులో ప్రభుత్వ ఆస్తులను దొంగలిస్తున్న ముఠాను చిన్నబజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత జూబ్లీ హాస్పిటల్ రోడ్డులోని BSNL కార్యాలయంలో కిటికీ రాడ్లు తొలగించి చొరబడి దొంగతనం చేశారు. నిందితులు చెన్నంశెట్టి కుమార్(ముత్తుకూరు ఇందిరమ్మ కాలనీ), దీపాల వెంకయ్య(రాజుపాలెం, కొడవలూరు), అరవ ఖలీ(వేదాయపాలెం)గా గుర్తించారు. మూలాపేటలో అరెస్ట్ చేసి వారి నుంచి 40 మీటర్ల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.