Nellore

News March 18, 2026

నెల్లూరు: పాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

image

నెల్లూరు జిల్లాలో లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీప్రణతి ఫ్లోరా ఆధ్వర్యంలో నెల్లూరు పరిధిలోని 2 పాల కేంద్రాలపై దాడులు చేశారు. పాల నమూనాలను సేకరించారు. విడవలూరు మండల పరిధిలోని పాల కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డి.నీరజ, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

News March 18, 2026

నెల్లూరు: దొంగల ముఠా అరెస్ట్

image

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో 195 ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసిన దొంగలు పట్టుబడ్డారు. వారి నుంచి 400KGల రాగి, 2ఆటోలు, 2బైక్‌లు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి SP సుబ్బరాయుడు తెలిపారు. నిందితులు గూడూరు(M) గొల్లపల్లికి చెందిన బండి వాసు(22), బూదూరు మణి(27), కత్తి పోలయ్య(40), చందు(25), ఏకోలు మధు(32)గా గుర్తించారు. మనుబోలు(M) యాచవరానికి చెందిన చల్లా రాఘవ వాళ్ల నుంచి రాగి కొనడంతో అరెస్ట్ చేశారు.

News March 18, 2026

నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

కండలేరు, సోమశిల జలాశయాల భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి భూములను సంబంధిత శాఖకు అందించేలా చర్యలు తీసుకోవాలి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబధిత అధికారులకు సూచించారు. తన ఛాంబర్‌లో ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష చేశారు. ఆనం సంజీవయ్య బ్రాంచ్ కెనాల్, కేజీఎం బ్రాంచ్ కెనాల్‌ భూసేకరణ పూర్తైన తర్వాత అవార్డ్ జారీచేయడంతో పాటు యజమానులకు త్వరితగతిన పరిహారం చెల్లించాలని చెప్పారు.

News March 18, 2026

దివ్యాంగులతో నెల్లూరు కలెక్టర్ ప్రయాణం

image

నెల్లూరు జిల్లాలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభమైంది. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, మేయర్ సుజాత, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి బస్సును ప్రారంభించారు. తర్వాత దివ్యాంగులతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశారు.

News March 18, 2026

నెల్లూరు: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

image

ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు మంగళవారంతో ముగిసినట్లు RIO వరప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో 23,334 మంది విద్యార్థులకుగానూ 22,843 మంది హాజరయ్యారన్నారు. జిల్లాలో జరిగిన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడం వల్ల ప్రశాంతంగా ముగిశాయన్నారు. నేడు ద్వితీయ సంవత్సరం ప్రధాన పరీక్షలు కూడా ముగియనున్నట్లు ఆయన తెలిపారు.

News March 18, 2026

నెల్లూరు: నిధుల గోల్‌మాల్.. ముగ్గురిపై వేటు

image

సామాజిక పింఛన్ల నగదు, మండల పరిషత్ సాధారణ నిధులను స్వాహా చేశారన్న ఆరోపణలపై MPDO, AO, జూనియర్ అసిస్టెంట్లను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోట మండలంలో MPDOగా పనిచేసిన బ్రహ్మయ్య, AO కౌసల్య, జూనియర్ అసిస్టెంట్ అబూబకర్ సిద్ధిఖ్ పింఛన్లు, మండల పరిషత్‌లో దాదాపు రూ.53లక్షల వరకు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విచారణ అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 18, 2026

కోవూరు: ఇల్లా.. నందనవనమా..?

image

కోవూరు మండలం పాటూరులో ఓ వ్యక్తి తన ఇంటిని పూల చెట్లతో నందనవనంలా మార్చాడు. తన మూడు అంతస్తుల ఇంటిని ఒక్కొక్క అంతస్తుకి ఒక అరలాగా కనిపించేలా కాగితాల పూల చెట్లను అల్లించాడు. దీంతో వేసవి కాలంలో ఆ ఇంట్లో చల్లదనం తోపాటు స్వచ్ఛమైన గాలి అందుతోంది. ఈ రంగు రంగుల కాగితాల పూలతో ఆ ఇల్లు అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటోంది.

News March 17, 2026

నెల్లూరు జిల్లాకు 18 కొత్త మొబైల్ టవర్లు

image

నెల్లూరు జిల్లాలో నెట్‌వర్క్ లేని మారుమూల గ్రామాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో 18 కొత్త మొబైల్ టవర్లు మంజూరైనట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో ఎంపీ చర్చించారు. దీంతో 2026 డిసెంబర్ నాటికి ఆత్మకూరు, కోవూరు, కందుకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ టవర్లను ఏర్పాటు చేయనున్నారు.

News March 17, 2026

అక్రమ కేసులకు భయపడం: కాకాణి

image

తప్పు చేసిన వారిని వదిలేసి, ప్రశ్నించే వారిని జైలుకు పంపుతారా? అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి నేతలు చెప్పినట్లు అక్రమ అరెస్టులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

News March 17, 2026

నెల్లూరు: 4107 ఫైర్ యాక్సిడెంట్స్.. రూ. 95 కోట్లు డ్యామేజ్

image

అసలే వేసవి కాలం ఎక్కడ ఏ నిప్పు అంటుకుంటుందో, ఎక్కడ పెను ప్రమాదం పొంచి ఉంటుందో తెలీదు. 2020-26 మధ్య 4107 అగ్ని ప్రమాదాలు జరిగాయి. రూ.95.54 కోట్ల డామేజ్ అవగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఈప్రమాదాల్లో రూ.179 కోట్ల మేరా నష్టం నుంచి కాపాడి 33 మందిని సేవ్ చేశారు. అగ్ని ప్రమాదాలు ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది.