Nellore

News October 5, 2024

పీఎం కిసాన్ ద్వారా 1,67,247 రైతులకు లబ్ధి: జేడీ

image

నెల్లూరు జిల్లాకు పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదలైనట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి తెలిపారు. దీని వల్ల జిల్లాలోని 1,67,247 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆయా రైతుల అకౌంట్లో ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాకు రూ.33.40 కోట్లు విడుదలైనట్టు జేడీ పేర్కొన్నారు.

News October 5, 2024

నేడు, రేపు ఆర్టీసీ బస్సు పాసుల జారీ నిలిపివేత

image

ఏపీఎస్‌ఆర్టీసీలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తున్న కారణంగా.. శని, ఆదివారాల్లో (5, 6 తేదీలు) అన్ని రకాల బస్సు పాసులు నిలిపివేస్తున్నామని ఆత్మకూరు డిపో మేనేజర్ కరీమున్నీసా తెలిపారు. సోమవారం నుంచి కౌంటర్లలో బస్సు పాసులు జారీ చేస్తామని చెప్పారు. ప్రయాణికులు, విద్యార్థులు ఆర్టీసీ సంస్థకు సహకరించాలని కోరారు.

News October 5, 2024

నెల్లూరు: టీడీపీలో చేరిన కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆయనతో పాటు మిత్రబృందానికి టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, వారి కోసం పనిచేయాలని శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

News October 4, 2024

తిరుమలకు చేరుకున్న మంత్రి ఆనం

image

సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం శ్రీవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. ఆయనను టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి ఏర్పాట్లను వివరించారు.

News October 4, 2024

రైల్వే ప్రాజెక్టులపై ఎంపీ వీపీఆర్ చర్చ

image

విజయవాడలోని సత్యనారాయణపురం ఈటీటీ సెంటర్‌లో దక్షిణ మధ్య రైల్వే అధికారుల సమావేశం శుక్రవారం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమావేశానికి హాజరై పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో దుస్థితిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి, నడికుడి రైల్వే లైను తదితర అంశాలపై చర్చించారు.

News October 4, 2024

పెన్నా నదిలో యువతి మృతి

image

నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఈరోజు ఉదయం రంగనాయకుల స్వామి గుడి వెనుక నదిలో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె బుర్కా ధరించి ఉన్నారు. సుమారు 18 నుంచి 20 ఏళ్ల లోపు వయస్సు ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన వాళ్లు నెల్లూరు సంతపేట పోలీసులను సంప్రదించాలని కోరారు.

News October 4, 2024

రాజకీయ పార్టీలకు నెల్లూరు కలెక్టర్ సూచనలు

image

నెల్లూరు జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ ఒ.ఆనంద్ కోరారు. ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ సమ్మరి రివిజన్-2025లో భాగంగా ఈనెల 29న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురిస్తారని తెలిపారు. వాటిపై నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని చెప్పారు. డిసెంబర్ 24వ తేదీ లోపు అభ్యంతరాలను పరిష్కరించి.. 2025 సంవత్సరం జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తామన్నారు.

News October 4, 2024

వెంకటగిరి పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటగిరి పట్టణంలోని బొప్పాపురానికి చెందిన నర్సింహులకు సైదాపురం మండలం దేవర వేమూరుకు చెందిన శైలజ ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైంది. కొద్ది రోజులకు ప్రేమించుకున్నారు. ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఎస్ఐ సుబ్బారావు ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను ఇళ్లకు పంపించారు.

News October 4, 2024

NLR: బాలికపై లైంగిక దాడికి యత్నం

image

బాలికపై యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వెంకటాచలం మండలంలో ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక టిఫిన్ తెచ్చుకునేందుకు బయల్దేరింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 4, 2024

సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్

image

నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.