Nellore

News September 30, 2024

నెల్లూరు: SP కార్యాలయానికి 105 ఫిర్యాదులు

image

నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 105 ఫిర్యాదులు అందినట్లు ASP CH.సౌజన్య తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని ఆమె తెలిపారు.

News September 30, 2024

SVU : నేడే లాస్ట్ డేట్.. Don’t Miss It

image

SV యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (UG) వార్షిక విధానంలో 1990- 2015 మధ్య ఒక సబ్జెక్టు, 2 అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు, ప్రాక్టికల్స్ ఫెయిలైన అభ్యర్థులకు మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటి పరీక్ష ఫీజు చెల్లించడానికి సోమవారంతో గడువు ముగుస్తుందని యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫైన్ తో అక్టోబర్ 15 వరకు గడువు ఉన్నట్లు తెలియజేశారు.

News September 30, 2024

నెల్లూరులో రైలు ఢీకొని మహిళ మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి గూడ్స్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 29, 2024

గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు

image

గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

News September 29, 2024

కలువాయి మండలంలో మరో సైబర్ క్రైం

image

కలువాయిలో ఆశా వర్కర్ ఖాతా నుంచి నగదు కొట్టేసిన ఘటన తెలిసిందే. అదే మండలంలోని ఉయ్యాలపల్లి సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న యస్. వెంకటరమణమ్మ ఖాతా నుంచి రూ.33,350 సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీ మొబైల్‌లో ఈ-సిమ్ యాక్టివేట్ అయ్యింది ప్రొఫైల్ ‘ON’ చేయమని మెసేజ్ వచ్చింది. దీనితో ఆమె ‘ON’ నొక్కగానే ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందని ఆమె తెలిపారు.

News September 29, 2024

నెల్లూరు జిల్లాలో ASIలుగా పోస్టింగ్ పొందింది వీరే..

image

➥భాస్కర్ రెడ్డి-ఏఎస్ పేట
➥రియాజ్ అహ్మద్-చిన్నబజార్
➥వరప్రసాద్, ఉమామహేశ్వరరావు-సౌత్ ట్రాఫిక్
➥శ్రీహరిబాబు, శ్రీధర్రావు, లక్ష్మీ నరసయ్య-నవాబుపేట
➥షేక్.జిలాని-మనుబోలు
➥మాల్యాద్రి-కావలి2
➥మునిరావు-వేదాయపాలెం
➥రాజగోపాల్-గుడ్లూరు
➥ వెంకటేశ్వర్లు-ఇందుకూరుపేట
➥మాధవరావు-వేదయపాలెం
➥కరీముల్లా-విడవలూరు
➥సురేంద్రబాబు-Nరూరల్
➥మునికృష్ణ-వెంకటాచలం
➥V.శ్రీనివాసులు-కోవూరు

News September 29, 2024

నెల్లూరు: వదినను చంపిన వ్యక్తి అరెస్ట్

image

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నూరులో వదినను హత్య చేసిన కేసులో ముద్దాయి పాలెపు రమేశ్‌ను శనివారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై పి మనోజ్ కుమార్ తెలిపారు. తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద గూడూరు రూరల్ CI , SI, సిబ్బందితో కలిసి అరెస్టు చేశామని అన్నారు.

News September 29, 2024

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్

image

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

News September 28, 2024

వేదాయపాలెం రైల్వే స్టేషన్‌లో వృద్ధురాలు

image

నెల్లూరు నగరం వేదయపాలెం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలను వదిలేసి వెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు 108 సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఆమెను వివరాలు అడగగా.. తన పేరు బుజ్జమ్మని మిగిలిన వివరాలు చెప్పలేకపోయిందని అధికారులు తెలిపారు.