Nellore

News March 13, 2026

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత.. JC క్లారిటీ

image

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు ఎవరూ నమ్మవద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గృహ వినియోగానికి సరిపడా LPG సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు.

News March 13, 2026

నెల్లూరు జిల్లాలో హోటళ్లు క్లోజ్!

image

నెల్లూరు జిల్లాలో 2వేల వరకు కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో చాలా చోట్ల హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మూతపడుతున్నాయి. కొందరు విధిలేని పరిస్థితుల్లో డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేసి హోటళ్లు నడిపిస్తున్నారు. ప్రజలు సైతం డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్‌కు ఒకేసారి ప్రయత్నించడంతో కంపెనీలు సర్వర్లను బంద్ చేసినట్లు తెలుస్తోంది.

News March 13, 2026

నెల్లూరు జిల్లాలో రూ.30కోట్ల వసూళ్లు

image

నెల్లూరు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి సూచించారు. ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలతో ఆమె టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా పేరుకుపోయిన పన్నుల వసూళ్లపై సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు రూ.30 కోట్ల పన్నులు వసూలు చేయగా.. మిగిలిన రూ.16 కోట్లు ఈ నెల 15వ తేదీలోగా రాబట్టాలని ఆదేశించారు.

News March 13, 2026

యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

image

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్‌ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

News March 13, 2026

నెల్లూరు: రైల్వే ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్

image

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్-D పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి పి.వెంకట లక్ష్మి తెలిపారు. BC, SC, ST అభ్యర్థులు ఈనెల 23వ తేదీలోగా అప్లికేషన్లను నెల్లూరు RTC బస్టాండ్ సమీపంలోని తమ ఆఫీసులో ఇవ్వాలని సూచించారు. మెరిట్ ఆధారంగా 100మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఈనెల 25 నుంచి 2నెలలు శిక్షణ ఇస్తామన్నారు. స్టైఫండ్ కూడా ఇవ్వనున్నారు.

News March 13, 2026

హైవేల వెంట వేసైడ్ అమెనిటీస్‌కు పెట్టుబడిదారుల ఆసక్తి : కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు, హైవే మార్గాల వెంట ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించే వేసైడ్ అమెనిటీస్ (Wayside Amenities) ఏర్పాటుకు పెట్టుబడిదారుల నుంచి గణనీయమైన ఆసక్తి వ్యక్తమవుతోందని కలెక్టర్ హిమాన్షు శుక్ల సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రయాణికులకు సౌకర్యంగా ఫుడ్ కోర్టులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిక్ వాహనాలకు EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

News March 12, 2026

నెల్లూరు: రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్-D 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారి పి. వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన BC,SC,ST కులాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక కాబడిన 100 మంది అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తామన్నారు.

News March 12, 2026

గూడూరు ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

image

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇవాళ జరుగుతున్న మంత్రి లోకేశ్ పర్యటనకు ఎమ్మెల్యే సునీల్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ కాన్వాయ్‌లో వెళ్తున్న సునీల్ కుమార్ కారుకు అల్లూరు మండలం, సున్నపుబట్టి వద్ద త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరూ సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2026

నెల్లూరు జిల్లాకు రూ.110.97 కోట్ల మంజూరు

image

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరయ్యాయి. నెల్లూరు జిల్లాలోని రైతులకు రూ.110.97 కోట్లు మంజూరైనట్లు వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి తెలిపారు. శుక్రవారం నగదు జమ కానుంది. ఉదయగిరికి రూ.25.74 కోట్లు, ఆత్మకూరుకు రూ.19.59కోట్లు, కావలికి రూ.10.14 కోట్లు, కోవూరుకు రూ.9.30 కోట్లు, సర్వేపల్లికి రూ.15.84, నెల్లూరుకు రూ.2.97కోట్లు, వెంకటగిరికి రూ.9.07కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరయ్యాయి.

News March 12, 2026

ముత్యాలమ్మ జాతరలో డ్రోన్లతో నిఘా

image

తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర ఘనంగా జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. కమాండ్ కంట్రోల్ సీసీ టీవీ ఫుటేజ్‌తో పాటు డ్రోన్ల పర్యవేక్షణ కొనసాగించారు. జాతరలో అసాంఘిక కార్యక్రమాలు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వంటివి జరగకుండా అరికట్టారు.