India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ తెలిపారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు, ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 36 మంది పోలీసులు వారి యొక్క సమస్యల గురించి తెలుసుకున్నారు. ట్రాన్స్ ఫర్లు, రిక్వెస్ట్‌లు, మెడికల్ సమస్యలు వంటి సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.
సంగం బ్యారేజ్ కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పెట్టిన పేరును కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజాగా శుక్రవారం బ్యారేజ్ వద్ద బోర్డుపై ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి పేరును వైట్ వాస్ వేసి తొలగించారు. దీంతో పలువురు వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పెట్టిన పేర్లను తొలగించాలని కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల సీసీ, ఎమ్మెస్ సీసీలకు డీఆర్డీఏ పీడీ సాంబశివా రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందుగా 5 సంవత్సరాలు ఒకే మండలంలో పనిచేసిన సిబ్బందికి నియోజకవర్గం వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించారు. మధ్యాహ్నం రిక్వెస్ట్ పెట్టిన ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
చిల్లకూరు మండల పరిధిలోని చేడిమాల-తొణుకుమాల గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో కాపలాదారు ఒక వ్యక్తి మృతదేహం గురువారం బయట పడింది. ఎస్ఐ సురేశ్ బాబు మాట్లాడుతూ.. మామిడి తోట కాపలాదారులు కనబడటంలేదని, మామిడి తోట యజమాని ఫిర్యాదు చేశారన్నారు. తోటను పరిశీలించడంతో మట్టి పూడ్చిన విషయం గమనించి తవ్వడంతో మృతదేహం బయట పడినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.
నెల్లూరు కార్పొరేషన్‌లోని పలువురు కార్పొరేటర్లు నేడో, రేపో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. కొందరు కార్పొరేటర్లు గురువారం మంత్రి నారాయణ సన్నిహితుడు విజయభాస్కర్ రెడ్డిని కలిశారు. ముజీర్, పి.వెంకటేశ్వర్లురెడ్డి, సంక్రాంతి కల్యాణ్, కర్తం ప్రతాప్ రెడ్డి, వందవాసి రంగా, కాయల సురేశ్ వీబీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మొదటి విడతలో 16 మంది చేరికకు రంగం సిద్ధమైంది. మిగతా 27 మంది కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది.
ఎన్నికల హామీల్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో గురువారం ఆమె మాట్లాడుతూ .. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాలులో ఈనెల 14న శనివారం జాబ్ మేళా ఏర్పాటు చేశామని చెప్పారు. పలు సంస్థల ప్రతినిధులు వస్తారని.. నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.
అదానీ కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ముత్తుకూరు సెంటర్‌లో ఈనెల 22వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు CITU ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టనున్నారు. అలాగే ఈనెల 16న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
నెల్లూరులోని ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల యాజమానులతో సమీక్ష జరిగింది. ఆ సంస్థ జోనల్ మేనేజర్ శేఖర్ రెడ్డి మాట్లాడూతూ.. వెంకటాచలంలోని పారిశ్రామికవాడలో 41 మంది ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని నేటి వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. ఆయా స్థలాలను నూతన పరిశ్రమలకు త్వరలో కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం అక్కడ నీటి వసతికి బోర్లు వేస్తున్నామని చెప్పారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీమల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో అక్టోబర్ మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ సందర్భంగా అలంకరణ పనులకు శుక్రవారం ఉదయం 11 గంటలకు టెండర్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో ఆర్వభూమి వెంకట శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్నవారు టెండర్లలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాకు చెందిన నాన్ క్యాడర్ ఎస్పీ కారుకు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా కళ్యాణీ డ్యాం వద్ద ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో నాన్ క్యాడర్ ఎస్పీగా సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారు. ఆయన కారు విజయవాడ నుంచి తిరుపతికి వస్తుండగా మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద హైవేపై లారీ ఢీకొట్టింది. కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎస్ఐ రాకేశ్ విచారణ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.