India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న నెల్లూరు జడ్పీ మీటింగ్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మహిళా జన సున్వాయి’ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్‌లో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొని గృహ హింస, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

మహిళల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 9న నెల్లూరు జడ్పీ మీటింగ్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మహిళా జన సున్వాయి’ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఆధ్వర్యంలో జరిగే ఈ డ్రైవ్‌లో జిల్లా అధికారులు, పోలీసులు పాల్గొని గృహ హింస, వేధింపులపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ నిఘా, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి, 24 డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రగ్స్ అమ్మినా లేదా వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉన్నవారు ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా డయల్ 112 కి ఫిర్యాదు చేయాలని కోరారు.

వ్యవసాయ అనుబంధ రంగాలను బ్యాంకర్లు ప్రోత్సహించేలా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బ్యాంకర్లకు సూచించారు. జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం ఆయన నిర్వహించారు. ఖర్చులు తగ్గి వ్యవసాయం మరింత సులభతరం అవుతుందన్నారు. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రోన్‌లు వంటి పరికరాల కొనుగోలుకు అన్ని బ్యాంకులు ఉదారంగా రుణాలు మంజూరు చేయాలన్నారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని కోరారు.

రెవెన్యూ అధికారులందరూ చట్టాలపై అవగాహన పెంచుకుని ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. మ్యూటేషన్లు, రీ-సర్వే, 22ఏ వంటి అంశాల్లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

రైతులందరూ పంట నమోదు చేసుకొని 11 అంకెలు కలిగిన విశిష్ట సంఖ్యను కలిగి ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి సూచించారు. శుక్రవారం పాటూరు రైతు సేవా కేంద్రంలో ప్రధానమంత్రి లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాంలో ఏడీఏ అనిత, ఏవో రజినితో కలిసి పాల్గొన్నారు. విశిష్ట సంఖ్య కలిగిన రైతులు మాత్రమే ప్రభుత్వ పథకాలకు అర్హులు అన్నారు. మరో 4 రోజుల్లో కోవూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

జిల్లాలో చికెన్ ధరలు మరోసారి కొండెక్కాయి. వేసవిలో చికెన్ ధరలు తగ్గడం సహజం. అయితే అనూహ్యంగా మార్చిలో ధర పెరగడంతో మాంసం ప్రియులు షాక్‌కి గురవుతున్నారు. జనవరిలో పండుగల సందర్భంగా స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.350 ఉండగా అనంతరం ధరలు తగ్గు ముఖం పట్టాయి. మార్చి ప్రారంభం కాగానే మళ్లీ చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

నెల్లూరు జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే కావలిలో నిన్న అత్యధికంగా 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యిందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు కంటే ఎక్కువ కాస్తుందని తెలిపారు. ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పదో తరగతి హాల్ టికెట్‌లో తప్పులు దొర్లినట్లు విద్యార్థులు తెలిపారు. మనుబోలు ZP హైస్కూల్లో చదువుతున్న వారికి పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని పక్కనే ఉన్న ZP బాలికల హైస్కూల్‌ను కేటాయిస్తారు. అయితే ఈసారి హాల్ టికెట్‌లో ZP బాలికల హైస్కూల్ కేంద్రం కోడ్‌ను వేసి, పరీక్షా కేంద్రం పేరు ZP హైస్కూల్ అని వచ్చిందన్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

బాలిక(8)పై 40 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. TP గూడూరు (M)లో గిరిజన కుటుంబం నివసిస్తోంది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా తమ్ముడితో కలిసి బాలిక ఇంట్లో ఉంటోంది. గుర్తుతెలియని వ్యక్తి, ఓ మహిళ బైక్‌పై వచ్చారు. బాలిక తమ్ముడికి మహిళ మాయమాటలు చెప్పి పక్కకు తీసుకెళ్లగా.. ఆ వ్యక్తి బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.