India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాకు చెందిన నాన్ క్యాడర్ ఎస్పీ కారుకు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా కళ్యాణీ డ్యాం వద్ద ఉన్న పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో నాన్ క్యాడర్ ఎస్పీగా సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారు. ఆయన కారు విజయవాడ నుంచి తిరుపతికి వస్తుండగా మనుబోలు మండలం కొండూరు సత్రం వద్ద హైవేపై లారీ ఢీకొట్టింది. కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఎస్ఐ రాకేశ్ విచారణ చేస్తున్నారు.
సైదాపురం మండలం, మొలకలపూండ్ల అరుంధతివాడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని ఓ కొడుకు రాయితో కొట్టి చంపిన ఘటన ఇవాళ జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. స్థానిక అరుంధతివాడలో కాపురముంటున్న పాలెపు. వెంకటేశ్వర్లుని తన కొడుకు శివాజీ కుటుంబ కక్షల నేపథ్యంలో రాయితో కొట్టి చంపాడు. ఈ ఘటనపై సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ ఆర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ANM/GNM/ బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి జపాన్ దేశంలో కేర్ వర్కర్స్ ఇన్ హాస్పిటల్స్/ కేర్ హోం ఫెసిలిటీ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు నెల్లూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, సి.విజయ వినీల్ కుమార్ తెలిపారు. అర్హులైన వారు https://shorturl.at/FB7ok ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
రెండు రోజుల వ్యవధిలోనే మూడు హత్యలు జరగడం పట్ల గూడూరు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్కరోజే రెండు హత్యలు జరగా బుధవారం మరో హత్య గూడూరు ప్రాంతంలో కలకలం రేపింది. చిల్లకూరు మండలం తణుకుమాల గ్రామంలో ఓ వ్యక్తిని హత్య చేసి పూడ్చిపెట్టగా.. సైదాపురం మండలం గంగదేవిపల్లి గ్రామంలో భార్యను అనుమానంతో భర్త కడతేర్చాడు. బుధవారం గూడూరు శివారు ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
తడ మండలంలోని నిప్పో ఫ్యాక్టరీ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనగా విష్ణు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడగా హాస్పిటల్ కి తరలించారు. తడ ఎస్సై కొండప్ప నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లమ్మ గుడి రైల్వే ట్రాక్ సమీపంలో సుమారు 23 నుంచి 25 ఏళ్ల యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గూడూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు, యువకుడు పడి ఉన్న తీరును గాయాలను బట్టి ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా వీఆర్లో ఉన్న సివిల్ ఎస్ఐలతోపాటు, ఇటీవలే ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందిన వారికి అటాచ్మెంట్ పై పోలీసు స్టేషన్లో పోస్టింగ్ కల్పిస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. చిన్నబజారుకు ఎస్ఎం బాషా, నెల్లూరు రూరల్ కు ఆర్ సుధీర్ కుమార్, ఆత్మకూరుకు కే శ్రీనివాసులురెడ్డి, కావలి-2 ఎస్ కే గౌష్ బాషా, కోవూరుకు ఎస్ కే ఖాదర్ బాషా తదితరులు ఉన్నారు.
తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట బుధవారం గూడూరు డీఎస్పీని ఆశ్రయించింది. గూడూరు పట్టణానికి చెందిన సాయికుమార్, బళ్లారికి చెందిన దివ్య గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించడంతో వారే పెళ్లిచేసుకుని డీఎస్పీని ఆశ్రయించారు. తమతల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు. ప్రస్తుతం వారి జంట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక, పుణే నుంచి దిగుమతి అవుతున్న సరకు.. అక్కడే కిలో రూ.50 వరకు ఉండటంతో రవాణా ఖర్చులతో ఇక్కడికి చేరే సరికి మరింత పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్‌కు రాకపోవడంతో కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు.
ఈనెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మంగళవారం ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వీఆర్వో పెంచల కిషోర్ సంబంధిత శాఖల అధికారులు కలిసి ఆయన జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.