Nellore

News September 10, 2024

కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త

image

నెల్లూరు కార్పొరేషన్‌లో జరిగిన సంతకాల ఫోర్జరీ అభియోగం కేసులో మేయర్ భర్త జయవర్ధన్ నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు జయవర్ధన్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో టౌన్ ప్లానింగ్ అధికారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. కీలక నిందితుడిగా జయవర్ధన్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

News September 10, 2024

సర్వేపల్లి: బాధితులకు పారిశ్రామికవేత్తల భారీ సాయం

image

వరద బాధితులను ఆదుకునేందుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలు భారీ సాయం ప్రకటించారు. రూ.2.97 కోట్ల విలువైన చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడికు మంగళవారం అందజేశారు. జెమిని ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ కంపెనీ రూ.2 కోట్లు, ఎస్ఈఐఎల్ పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు రూ.50 లక్షలు, పలు కంపెనీల ప్రతినిధులు కలిసి రూ.47 లక్షలను అందజేశారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

News September 10, 2024

విజయవాడకు అండగా నిలిచిన నెల్లూరు

image

నెల్లూరు పారిశ్రామిక వేత్తలు పలువురు తమ మంచి మనసు చాటుకున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకొనేందుకు తమ వంతు సాయం అందించారు. సోమిరెడ్డి సమక్షంలో జెమినీ ఎడిబుల్ ఆయిల్స్& ఫ్యాట్ లిమిటెడ్ రూ.2కోట్లు, పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లో మంగళవారం చంద్రబాబుకు చెక్కు అందించారు.

News September 10, 2024

నాయుడుపేట: సముద్రంలో యువకుని మృతదేహం లభ్యం

image

వినాయక నిమజ్జనానికి వచ్చి తూపిలిపాలెం సముద్రంలో గల్లంతైన నాయుడుపేటకు చెందిన యువకుడు మునిరాజా (22) మృతదేహం మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. నిమజ్జనానికి సోమవారం నాయుడుపేట నుంచి వెళ్లిన యువకులలో ఫయాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతనికి స్నేహితుడైన ముని రాజా మృతదేహం కూడా మంగళవారం లభ్యమయింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News September 10, 2024

నెల్లూరు జిల్లాలో ర్యాట్ ఫీవర్?

image

అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్ ఫీవర్ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు. ఆదివారం మళ్లీ అనారోగ్యానికి గురవ్వగా నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీనిపై అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరావు వివరణ ఇచ్చారు. ర్యాట్ ఫీవర్ ప్రాణాంతకమని, తాగేనీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఆ వ్యాధి సోకుతుందన్నారు.

News September 10, 2024

నేడు నెల్లూరు, కావలిలో జాబ్ మేళా

image

యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 10న నెల్లూరు, కావలిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.వినయ్ కుమార్ తెలిపారు.పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఉన్నత చదువులు చదివిన వారు అర్హులన్నారు. ఆరోజు ఉదయం 10.30 నుంచి నెల్లూరు దర్గా మిట్టలోని డీకేడబ్ల్యూ మహిళా కళాశాల , కావలి R&B, జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యాలయాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో హాజరుకావాలన్నారు.

News September 10, 2024

జిల్లాలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు: కలెక్టర్ ఆనంద్

image

ఈనెల 14 నుంచి అక్టోబర్ 2 వరకు స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత పేరుతో నెల్లూరు జిల్లాలో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో 15 మంది అధికారులతో ప్రత్యేక స్టీరింగ్ కమిటీని నియమించామన్నారు. జిల్లా వ్యాప్తంగా అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించాలన్నారు.

News September 9, 2024

గూడూరులో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

image

గూడూరులో ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గంగా కావేరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి గూడూరు వద్ద కిందకు దిగాడు. మళ్లే ఎక్కే క్రమంలో రైలు కింద పడి దుర్మరణం పాలయ్యాడు. సదరు వ్యక్తి శరీరం రెండు ముక్కలు కావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. కాగా.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 9, 2024

తూపిలిపాలెం బీచ్ ఘటన.. ఇద్దరు మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ వద్ద వినాయక చవితి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సముద్రంలో వినాయకుడి నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. నాయుడుపేట నుంచి వినాయక నిమజ్జనం కోసం బీచ్‌కు వచ్చిన యువకుల్లో ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో మునిరాజా, ఫయాజ్ మృతి చెందగా.. మరో యువకుడిని గజ ఈతగాళ్లు కాపాడారు.

News September 9, 2024

3 నెలల బిడ్డ తల్లిదండ్రులకు అప్పగింత

image

నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌లో మూడు నెలల చంటిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. సాయంత్రం వరకు పసికందు సంబంధికులు ఎవరూ రాకపోవడంతో ఆ బిడ్డను నెల్లూరులోని శిశు గృహకు తరలించారు. ఈ క్రమంలో తమ బిడ్డ కనిపించడం లేదని చిన్న బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులకు బస్టాండ్ వద్దని దొరికిన శిశువును చూపారు. తమ బిడ్డే అని చెప్పడంతో అధికారులు ఆ పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు.