India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీసిటీకి వెళ్లతారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు పరిశ్రమలకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని ప్రభుత్వం తెలిపింది.
శ్రీసిటీలో 15 పరిశ్రమలను CM చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. శ్రీసిటీలో రూ.1570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా సుమారు 8480 మందికి ఉపాధి లభిస్తుంది. ఆరు పరిశ్రమల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మరో ఐదు పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ఒప్పందాలు కురుర్చుకోనున్నారు. వీటి ద్వారా 4060 మందికి ఉపాధి లభించనుంది.
సోమశిల జలాశయానికి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎగువ ప్రాంతాల నుంచి 10,620 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జలాశయ ఈఈ దశరధ రామిరెడ్డి తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 24.191 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 17, 18 స్లూయిస్ ద్వారా పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 115 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.
సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు సోమశిల ప్రాజెక్టు రిజర్వాయర్‌ను పరిశీలించుటకు హెలికాప్టర్‌లో వస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు సోమశిల రిజర్వాయర్ వద్ద హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
నెల్లూరులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మనీ స్కీం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ట్రస్ట్ పేరుతో జనాలకు టోకరా వేశారు. బాధితుల వివరాలు మేరకు.. చెన్నైకి చెందిన ఓ సంస్థ నెల్లూరు పొదలకూరు రోడ్డు వద్ద ఇంకో ట్రస్ట్ సహాయంతో ఒక సభ్యత్వానికి రూ.500 కడితే రూ.7లక్షలు, మరో సభ్యత్వానికి రూ.5 వేలు కడితే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 10 వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారని బాధితులు లబోదిబోమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కమిషనర్ సూర్య తేజ ఆకాంక్షించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీల రూపంలో కమిషనర్‌కు చెప్పొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండల పరిధిలోని ముసునూరు పంచాయతీ కొత్త గుంట నీటిలో గుర్తుతెలియని 15 నెలల బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విలేజ్ రెవెన్యూ అధికారి సమక్షంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇసుకకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే 0861- 2943569 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చని నెల్లూరు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇసుక డిపోలలో నిల్వలు తగ్గిపోతున్నందున టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుకకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలన్నారు.
మొక్కల పెంపకం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో శనివారం జరిగిన స్వర్ణ భారత్ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో మొక్క నాటారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
వరికుంటపాడు మండలంలో శనివారం సాయంత్రం గాలి వాన బీభత్సం సృష్టించింది. జి కొత్తపల్లి గ్రామ సమీపంలో వరి నాటుతుండగా పిడుగు పడి కోటయ్య(47) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఒక భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Sorry, no posts matched your criteria.